ఒకే కాన్పులో నలుగురు పిల్లల జననం.. నెట్టింట వైరలవుతున్న ఫొటోలు.. వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు.!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సీతాపూర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబంలో ఒకేసారి నలుగురు నయా అతిథులు అడుగుపెట్టిన ఘటన తీవ్ర ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపింది.

అక్కడి స్థానిక ఆసుపత్రిలో చేరిన ఒక మహిళ ఒకే ప్రసవంలో నలుగురు చిన్నారులకు జన్మనిచ్చింది.

వారిలో ముగ్గురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఈ అరుదైన కాన్పు అత్యంత సురక్షితంగా, విజయవంతంగా పూర్తయింది. తల్లితో పాటు పుట్టిన నలుగురు పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ఒకేసారి నలుగురు పిల్లలు పుట్టారన్న వార్త తెలుసుకున్న పలువురు ఆ కుటుంబాన్ని నేరుగా కలిసి, అలాగే సోషల్ మీడియా ద్వారా పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *