సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం కొందరు వింత చేష్టలు చేయడం సహజం. ఆ కోవలోనే, కాలువ దాటడానికి ఓ యువకుడు చేసిన విచిత్ర ప్రయత్నం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మురుగు కాలువకు అవతలి వైపునకు వెళ్లడం కోసం కాస్త దూరం నుంచి పూర్తి వేగంతో పరుగెత్తుకుంటూ వచ్చిన అతను, ఒక సూపర్హీరోలా గాల్లోకి ఎగిరి అవతలి ఒడ్డుకు చేరుకోవచ్చన్న ధీమాతో ఉన్నాడు. కానీ, చివరి క్షణంలో జరిగిన చిన్న తప్పిదం వల్ల అతని ప్రయత్నమంతా ఊహించని మలుపు తిరిగింది.
వైరల్ అవుతున్న వీడియోలో, మురుగు కాలువకు ఒకవైపు ఓ యువకుడు నిలబడి ఉండటం కనిపిస్తుంది. అవతలి వైపునకు వెళ్లాల్సి ఉండటంతో, కాస్త దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి కాలువను దాటాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పూర్తి స్పీడుతో పరుగెత్తుకొచ్చిన అతని కాన్ఫిడెన్స్ చూస్తే, ఎలాగైనా కాలువను దాటేస్తాడనే అనిపిస్తుంది. కాలువ దగ్గరకు రాగానే వేగంగా గాల్లోకి దూకాడు, దాదాపు అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు కూడా. దీంతో అతని ప్రయత్నం ఫలించిందని అక్కడ ఉన్నవారు కూడా అనుకున్నారు.
కానీ, అవతలి ఒడ్డున అడుగు పెట్టిన ఆ ఒక్క క్షణంలోనే అనూహ్యంగా అతని బ్యాలెన్స్ తప్పింది. అదుపు తప్పడంతో శరీరాన్ని నిలబెట్టుకోలేక నేరుగా మురుగు కాలువలోనే పడిపోయాడు. దీన్ని చూస్తున్న కొందరు వెంటనే సహాయం చేయడానికి బదులు పగలబడి నవ్వుతూ ఉండిపోయారు. యువకుడు ఎంతో నమ్మకంతో మొదలుపెట్టిన ఈ సాహసం, చివరకు ఇంతటి హాస్యాస్పదమైన ఘటనగా మారుతుందని ఎవరూ ఊహించి ఉండరు.
ఆ యువకుడు మురుగు కాలువను దాటడానికి ప్రయత్నించిన తీరు, చివరి క్షణంలో బ్యాలెన్స్ తప్పి పడిపోయిన విధానం సోషల్ మీడియాలో నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. వీడియో చూసిన కొందరు అతని ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతుండగా… మరికొందరు మాత్రం ఇంత వేగంగా పరిగెత్తుకొచ్చి కాలువ దాటాలనుకోవడమే అనవసరపు సాహసమని విమర్శిస్తున్నారు. ఏదేమైనా, విజయవంతంగా కాలువ దాటాలనుకున్న యువకుడి ప్రయత్నం బెడిసికొట్టిన ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

Leave a Reply