మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ పంచక్కీ-ఔరంగాపురా రహదారిపై, అద్నాన్ పఠాన్ అనే యువకుడు ఒకే స్కూటర్‌పై ఐదుగురితో కలిసి అత్యంత వేగంగా, ప్రమాదకర రీతిలో వాహనం నడుపుతూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియో చిత్రీకరించాడు.
ఆ వీడియోలో, హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడమే కాకుండా, వెనుక కూర్చున్న నలుగురు యువకులు మరో వ్యక్తిని గాల్లో వేలాడదీస్తూ అత్యంత ప్రమాదకరంగా ప్రయాణించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, ప్రజా భద్రతకు ముప్పు కలిగించేలా ఉండటంతో కంటోన్మెంట్ పోలీసులు అద్నాన్ పఠాన్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS), మోటారు వాహనాల చట్టం (MV Act) కింద కేసులు నమోదు చేశారు.
పోలీసులు రంగంలోకి దిగడంతో అద్నాన్ పఠాన్ మరో వీడియో విడుదల చేసి చేతులు జోడించి క్షమాపణలు కోరాడు. అందులో… “రీల్స్ మోజులో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి మేము చాలా పెద్ద తప్పు చేశాం. దీనివల్ల మాకే కాకుండా ప్రజలకూ ప్రమాదం వాటిల్లింది. ఇకపై ఇలాంటి పనులు ఎప్పుడూ చేయబోము; బైక్‌పై ఇద్దరు మాత్రమే ప్రయాణిస్తూ, తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తాము” అని హామీ ఇచ్చాడు.

Leave a Reply