ఒక్క మాట అన్నందుకు ఈ రేంజ్‌లోనా.? “కారులో వచ్చి అరాచకం.” బారికేడ్‌ను పగలగొట్టి సిబ్బందిపై దాడి చేసిన రౌడీలు.! ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియో.!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్‌పూర్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే బరోలా టోల్‌ప్లాజా వద్ద, కారులో వచ్చిన కొందరు వ్యక్తులు అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను బలవంతంగా తొలగించి వెళ్లడానికి ప్రయత్నించారు.

దీనిని గమనించిన టోల్‌ప్లాజా సిబ్బంది వారిని అడ్డుకుని, రుసుము (టోల్ ట్యాక్స్) చెల్లించాలని, నిబంధనలకు విరుద్ధంగా బారికేడ్‌ను తొలగించవద్దని చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కారులోని వ్యక్తులు, తామే ఆ ప్రాంతానికి దాదాలమన్నట్లు ప్రవర్తిస్తూ, టోల్‌ప్లాజా సిబ్బందిపై దారుణంగా దాడి చేశారు.

ఈ ఘటనపై సుల్తాన్‌పూర్ పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. దాడికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని, త్వరలోనే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. టోల్‌ప్లాజా వద్ద జరిగిన ఈ అరాచక సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.


Posted

in

by

Tags: