ఒళ్లు గగుర్పొడిచే ఘోరం: భర్త పొట్ట కోసి.. పేగులు తీసి సంచిలో కుక్కిన కిరాతక భార్య.. హర్యానాలో ఒళ్లు జలదరించే ఘటన!

హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో భర్తను భార్యే అత్యంత పాశవికంగా హతమార్చిన నరరూప రాక్షస ఘటన వెలుగులోకి వచ్చింది.

సదరు మహిళ పదునైన ఆయుధంతో భర్త ఛాతీ భాగం నుంచి మర్మాంగాల వరకు దాదాపు అడుగుకు పైగా పొడవున కోసి చీల్చింది. అనంతరం అతని శరీరంలోని పేగులను బయటకు తీసి ఒక ప్లాస్టిక్ సంచిలో కుక్కింది.

ఈ కిరాతక చర్య జరుగుతున్న సమయంలోనే ఇంటి యజమాని అనుకోకుండా అక్కడికి వచ్చాడు. అతడిని చూసి భయపడిన ఆ మహిళ వెంటనే ఇంటి పైకప్పు (రూఫ్) పైనుంచి కిందకు దూకేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మృతుడి దేహానికి నిర్వహించిన పోస్ట్‌మార్టంలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అతని కాలేయంలో (లివర్) సగం భాగం, అలాగే కుడి కిడ్నీ కనిపించకుండా పోయినట్లు వైద్యులు గుర్తించారు. నిందితురాలైన మహిళ చేతబడులు, క్షుద్రపూజలు చేసే అలవాటు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దారుణ హత్య వెనుక ఉన్న అసలు కారణాలు, కనిపించకుండా పోయిన శరీర అవయవాల మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *