Psycho Thriller Movies: 2 గంటల 3 నిమిషాల రన్టైమ్తో సాగే ఈ సినిమా, ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టే ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో నిండి ఉంది. ఈ సినిమా కథ కేవలం ఊహాజనితం కాదు. 2021లో పొరుగు రాష్ట్రమైన కేరళలో జరిగి, దేశವ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఒక భయంకరమైన యథార్థ సంఘటన ఆధారంగా దీనిని తెరకెక్కించారు.
సినిమాల్లో నటించే అవకాశం ఇప్పిస్తానని నమ్మించి, తొమ్మిది మంది అమాయక యువతులను అత్యంత క్రూరంగా వరుస హత్యలు (Serial Murders) చేసిన ‘స్టీఫెన్ జబరాజ్’ అనే సైకో కిల్లర్ చుట్టూ ఈ కథ మొత్తం తిరుగుతుంది. ఈ రక్తపాత చరిత్రను దర్శకుడు తెరపై అత్యంత ఉత్కంఠభరితంగా ఆవిష్కరించారు.
సాధారణంగా క్రైమ్ సినిమాల్లో పోలీసులు ఎంతో శ్రమించి హంతకుడిని పట్టుకోవడం మనం చూస్తుంటాం. కానీ ఈ చిత్రంలోని అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే.. పోలీసులు తనను కనిపెట్టడానికి ముందే స్టీఫెన్ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోతాడు. అంతటితో ఆగకుండా, కోర్టు ముందు నిలబడి తాను చేసిన తొమ్మిది హత్యలను నిర్మొహమాటంగా ఒప్పుకుంటాడు. అసలు స్టీఫెన్ ఈ భయంకరమైన నేరాలకు పాల్పడటానికి గల కారణం ఏంటి? అతని వెనుక ఉన్న చీకటి గతం (Past) ఏమిటి? అంతగా దారుణాలు చేసినవాడు స్వచ్ఛందంగా లొంగిపోవడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అనే అనేక ఆసక్తికరమైన ప్రశ్నలకు ఈ సినిమా సమాధానంగా నిలుస్తుంది.
భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటికే ‘కరీ అండ్ సైనైడ్’, ‘హౌస్ ఆఫ్ సీక్రెట్స్’ మరియు ‘ఢిల్లీ ఫైల్స్’ వంటి నిజ జీవిత నేరాల ఆధారంగా వచ్చిన డాక్యుమెంటరీలు, సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. అదే బాటలో పయనించిన దర్శకుడు మిథున్.. ఈ చిత్రాన్ని కేవలం ఒక క్రైమ్ స్టోరీలా కాకుండా, దానికి లవ్, హారర్, సస్పెన్స్ మరియు డార్క్ కామెడీ వంటి విభిన్నమైన ఎలిమెంట్స్‌ను జోడించి అద్భుతంగా మలిచారు. ఎవరూ ఊహించని విధంగా ఉండే ఈ చిత్ర క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.
చిత్రంలో ‘స్టీఫెన్’ పాత్రలో నటించిన గోమతి శంకర్ తన నటనతో వీక్షకుల్లో వణుకు పుట్టించారు. ఒక సైకో కిల్లర్ హావభావాలను, క్రూరమైన ప్రవర్తనను మరియు అతని మనస్తత్వాన్ని ఆయన స్క్రీన్‌పై అద్భుతంగా పండించారు. ఆయనకు తోడుగా మైఖేల్ తంగదురై మరియు స్మృతి వెంకట్ కీలక పాత్రల్లో నటించి తమ నటనతో ఆకట్టుకున్నారు.
