సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తున్న వారిని కలచివేస్తోంది. అందులో ఒక తల్లి, తన చిన్న వయసున్న కొడుకుని అత్యంత దారుణంగా కొడుతోంది.
ఆ పిల్లాడు నొప్పి భరించలేక అరుస్తున్న కేకలు ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తూ గుండెలను పిండేస్తున్నాయి. “కన్న కొడుకైనా సరే, తమిళ వెట్రి కళగం (TVK) గురించి తప్పుగా మాట్లాడినా లేదా కించపరిచినా ఊరుకోను” అని ఆ తల్లి ఆవేశంగా అరుస్తూ దాడి చేయడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. రాజకీయపరమైన భిన్నాభిప్రాయాలు ఒకే కుటుంబంలో ఇంతటి హింసకు దారితీయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
సోషల్ మీడియాలో ఆగ్రహం:
ఈ ఘటన నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. ఒక పార్టీపై ఉన్న అతిగా ఉన్న అభిమానం హద్దులు దాటి, కన్న కొడుకునే కొట్టే స్థాయికి చేరడంపై అందరూ మండిపడుతున్నారు. “రాజకీయం అనేది సిద్ధాంతాలకు సంబంధించింది, దానికి పోయి చిన్న పిల్లవాడిపై ఇంత హింస చూపించాలా?” అని ఒక వర్గం వారు, “పార్టీ విశ్వాసం పేరుతో జరిగే ఇలాంటి అరాచకాలను వెంటనే అరికట్టాలి” అని మరికొందరు సోషల్ మీడియా వేదికగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
