కన్నతల్లే కూతురి కాపురాన్ని కూల్చింది! అల్లుడితో హనీమూన్‌కు వెళ్లి గర్భవతి అయింది.. కూతురికి విడాకులు ఇప్పించి మరీ పెళ్లాడింది!

సాధారణంగా ఒక తల్లి తన కూతురిని ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. కూతురి సంతోషం కోసమే బతుకుతుంది. తాను ఎన్ని కష్టాలు పడినా కూతురి మొహంలో బాధ రానివ్వదు. కూతురు పెళ్లీడుకు రాగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని, కూతురిని జీవితాంతం బాగా చూసుకునే అల్లుడు దొరకాలని కోరుకుంటుంది. కానీ, ఆ కన్నతల్లే తన అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుని, కూతురి పచ్చని కాపురాన్ని నడిరోడ్డుపై పడేస్తే? వినడానికే అసహ్యంగా ఉన్నా ఇలాంటి ఘోరకలి నిజంగానే జరిగింది.

అల్లుడిని హనీమూన్‌కు తీసుకెళ్లిన అత్త!
మానవ సంబంధాలను తలకిందులు చేసిన ఈ వింత ఘటన 2020లో లండన్‌లో వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ‘లారెన్ వాల్’ అనే యువతికి 19 ఏళ్ల వయసున్నప్పుడు, ఎయిర్‌పోర్టులో పనిచేసే పాల్ వైట్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఆ సమయంలో లారెన్ తల్లి ‘ జూలీ వయసు 55 ఏళ్లు.

పెళ్లికి ముందే లారెన్ తన ప్రియుడు పాల్‌ను తల్లికి పరిచయం చేసింది. అయితే అప్పటి నుంచే జూలీకి, అల్లుడు పాల్‌కి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఎంత ఘోరం అంటే, పెళ్లి జరిగిన రోజే వారిద్దరూ శారీరక సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయం అమాయకురాలైన కూతురికి తెలియదు. పెళ్లి తర్వాత లారెన్, పాల్ హనీమూన్‌కు వెళ్లాల్సి ఉండగా, పాల్ చాకచక్యంగా వ్యవహరించి తన అత్త జూలీని కూడా హనీమూన్‌కు ఇన్వైట్ చేశాడు.

అల్లుడి బిడ్డకు తల్లి అయిన అత్త!
తన భర్త, కన్నతల్లి మధ్య అక్రమ సంబంధం ఉందనే విషయాన్ని లారెన్ ఊహించలేకపోయింది. తల్లి కూడా తమతో పాటు వస్తే సరదాగా తిరిగి వస్తుంది కదా అని భావించి ఆమె కూడా హనీమూన్‌కు రావడానికి అంగీకరించింది. కానీ తన భర్త పక్కన చేరేది తన కన్నతల్లే అని ఆమె గ్రహించలేకపోయింది.

కొన్ని వారాల హనీమూన్ తర్వాత ముగ్గురూ ఇంటికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత లారెన్, పాల్ మధ్య గొడవలు మొదలయ్యాయి. పెళ్లయిన కొన్ని వారాలకే పాల్ లారెన్‌కు విడాకులు ఇచ్చాడు. ఆ సమయానికి కూడా లారెన్‌కు తన తల్లి వల్లే ఈ విడాకులు జరిగాయనే నిజం తెలియదు.

వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజం:

విడాకులు అయిన కొన్ని నెలల తర్వాత లారెన్ తల్లి జూలీ గర్భం దాల్చింది. ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు తండ్రి మరెవరో కాదు, లారెన్ మాజీ భర్త పాల్ అనే నిజం తెలిసి లారెన్ గుండె పగిలిపోయింది. తన కన్నతల్లే తన జీవితాన్ని ఇలా నాశనం చేస్తుందని ఆమె కలగనైనా ఊహించలేదు.

కూతురికి విడాకులు ఇప్పించి అల్లుడితో పెళ్లి!
అంతటితో ఆగకుండా, జూలీ తన మాజీ అల్లుడు పాల్‌ను అధికారికంగా పెళ్లి చేసుకుని అతనితో కలిసి సంసారం చేయడం ప్రారంభించింది. ఈ ద్రోహానికి తన తల్లిని జీవితంలో ఎప్పటికీ క్షమించలేనని లారెన్ కన్నీరుమున్నీరైంది.

ఈ వింత కథ విన్న నెటిజన్లు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక కన్నతల్లి కూతురి జీవితంతో ఇంతలా ఆడుకుంటుందా అంటూ జూలీ ప్రవర్తనపై తీవ్రంగా మండిపడుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *