ఓ యువకుడు, తన తండ్రికి 35 ఏళ్లుగా స్నేహితుడైన ఓ కూరగాయల వ్యాపారిని కలిసి వచ్చిన ఘటన ప్రస్తుతం ఇంటర్నెట్లో అందరి హృదయాలను కదిలిస్తోంది.
ఆ యువకుడి తండ్రి 2013లోనే మరణించగా, ఆయన స్నేహితుడైన ఆ వ్యాపారి.. తన మిత్రుడి కుటుంబంపై ఉన్న ప్రేమతో గత 14 ఏళ్లుగా వాళ్లు కొనే కూరగాయలకు డబ్బులు తీసుకునేందుకు నిరాకరిస్తూ వస్తున్నాడు.
అక్కడికి వెళ్లి కూరగాయలు కొన్న తర్వాత ఆ యువకుడు డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించగా, “ఇది మన ఇల్లే కదా, ఇంట్లో వాళ్ల దగ్గర డబ్బులు తీసుకోను” అని ఆ వృద్ధుడు చిరునవ్వుతో, ప్రేమగా సున్నితంగా తిరస్కరించాడు.
అతనితో మాట్లాడి ఆ యువకుడు అక్కడినుంచి వెళుతున్నప్పుడు, చనిపోయిన తన ప్రాణ స్నేహితుడి జ్ఞాపకాలు గుర్తుకురావడంతో ఆ వృద్ధుడి కళ్లు చెమర్చాయి; సహజమైన ఆ ఆప్యాయత దృశ్యం చూసేవారి హృదయాలను హత్తుకుంటోంది.
స్నేహం ఎప్పుడూ ఉన్నతమైనదని, నిజమైన మానవత్వం కాలాన్ని దాటి నిలబడుతుందని చాటిచెప్పే ఈ ఘటనకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది.

Leave a Reply