కారులో జంట ముచ్చట్లు.. లోకాన్నే మరిచిపోయారు.! యువతి కాలిపై నుంచి కారు పోనిచ్చి బరితెగింపు.. నడిరోడ్డుపై జనం అరిచినా చెవికెక్కలేదు.. వీడియో పోస్ట్ చేసి బాధితురాలి ఆవేదన.!

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రద్దీగా ఉండే రోడ్డుపై ఓ యువతి కాలిపై నుంచి కారు ఎక్కించి పరారయ్యేందుకు ప్రయత్నించిన డ్రైవర్ నిర్వాకం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది.

‘@browngirl_sam_’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కలిగిన ఓ మహిళా బైకర్, తన హెల్మెట్ కెమెరాలో రికార్డైన ఈ భయానక దృశ్యాలను నెట్టింట పంచుకున్నారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. భారీ ట్రాఫిక్ జామ్‌లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్న సమయంలో, ఆమె ముందు వెళ్తున్న కారు అకస్మాత్తుగా బ్రేక్ వేసింది. దీంతో ఆమె కూడా వెంటనే తన బైక్‌ను ఆపింది. అయితే, వెనుక నుంచి వచ్చిన మరో కారు సడన్‌గా వచ్చి ఆమె కాలిపైకి ఎక్కేసింది.

వీడియోలో, కారు చక్రం కింద యువతి కాలు చిక్కుకుపోవడం, కారును వెనక్కి తీయాలంటూ ఆమె వాహనాన్ని బాదుతూ గట్టిగా కేకలు వేయడం కనిపిస్తుంది. చుట్టుపక్కల ఉన్న జనం కూడా కారును రివర్స్ తీయాలని అరవడం మొదలుపెట్టారు. కానీ డ్రైవర్ కారును వెనక్కి తీయాల్సింది పోయి, మళ్లీ ముందుకే పోనివ్వడంతో ఆమె కాలికి తీవ్ర గాయమైంది.

ఆ తర్వాత ఆమె తన బైక్‌ను రోడ్డు పక్కన ఆపి, కారును నిలపాలని కోరగా.. డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. “ఆ కారులో ఉన్న జంట తమ సొంత లోకంలో మునిగిపోయారు; ఎవరిని ఢీకొడుతున్నాం, ఎవరి కాలిపై నుంచి కారు ఎక్కిస్తున్నామనే కనీస స్పృహ కూడా వారికి లేదు” అని బాధితురాలు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది.

మొదట్లో ఈ వీడియోను బయటపెట్టకూడదని భావించినా, కారు డ్రైవర్ బాధ్యతారహిత ప్రవర్తన చూశాకే దీన్ని పోస్ట్ చేయాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన తదుపరి వీడియోను కూడా త్వరలోనే విడుదల చేస్తానని చెప్పింది. ఈ వీడియో చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు, ఆ నిర్లక్ష్యపు డ్రైవర్‌పై పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *