కుక్కలా ప్రవర్తించిన బాలుడు..! “ఇక చీకటి గదిలో బంధించండి”.. కాపాడలేమని చేతులెత్తేసిన డాక్టర్లు.. 22 రోజుల తర్వాత జరిగిన అద్భుతం.. వైద్య రంగంలోనే మిరాకిల్..!!

ఉత్తరప్రదేశ్‌లో కుక్క కాటుకు గురై రేబిస్ (Rabies) లక్షణాలతో కుక్కలా మొరుగుతూ, వైద్యులు సైతం ఆశలు వదులుకున్న 9వ తరగతి విద్యార్థి.. అద్భుత పోరాటం మరియు సరైన చికిత్సతో ప్రాణాలతో బయటపడిన ఘటన యావత్ వైద్య రంగాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్‌కు చెందిన కరణ్ అనే 9వ తరగతి విద్యార్థి, వారణాసిలోని తన మేనమామ ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ ఒక చిన్నారి పెంపుడు కుక్కతో ఆడుకుంటోంది. ఆ సమయంలో ఆ చిన్నారిని కాపాడే ప్రయత్నంలో కుక్క కరణ్‌ను కరిచింది. ఆ వెంటనే అతడికి ప్రాథమిక ఇంజెక్షన్ వేసినప్పటికీ, రేబిస్ భయంతో ఆసుపత్రికి వెళ్లగా అక్కడి సిబ్బంది “నీకేం కాదులే” అని నిర్లక్ష్యంగా చెప్పడంతో కరణ్ ఇంటికి తిరిగి వచ్చాడు.

కుక్క కరిచిన నాలుగు నెలల వరకు ఎలాంటి లక్షణాలు లేకుండా సాధారణంగానే ఉన్న ఆ బాలుడికి, మార్చి 13న అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయాడు. మరుసటి రోజు ఉదయం లేవగానే కుక్కలా అరవడం (మొరగడం) మొదలుపెట్టాడు. అతడు మాట్లాడలేకపోయాడు, నీళ్లను చూస్తే తీవ్రమైన భయం (హైడ్రోఫోబియా) మొదలై నోటి నుంచి లాలాజలం కారసాగింది. రేబిస్ వ్యాధి చివరి దశకు చేరిందని భావించిన కుటుంబ సభ్యులు అతడిని పలు ఆసుపత్రులకు తీసుకెళ్లారు. కానీ వైద్యులందరూ “ఇక ఇతడు బతకడం అసాధ్యం, చీకటి గదిలో బంధించి ఉంచండి, ఎవరూ తాకకండి” అని చేతులెత్తేశారు.

కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్న సమయంలో, ఒక బంధువు సలహాతో బాలుడిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) తరలించారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో అతనికి పూర్తిస్థాయి రేబిస్ వ్యాక్సిన్ కోర్సును ప్రారంభించారు. మొదటి 22 రోజుల్లో 5 డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు. నెల రోజుల తర్వాత మళ్లీ స్వల్ప లక్షణాలు కనిపించడంతో మరిన్ని అదనపు డోసులు అందించారు.

వైద్యులు సైతం ఆశలు వదిలేసి, చీకటి గదిలో నిర్బంధించాల్సిన స్థితిలో ఉన్న ఆ బాలుడు.. వ్యాక్సిన్ల ప్రభావం, వైద్యుల నిరంతర సహాయంతో క్రమంగా పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి చేరుకున్నాడు. ప్రస్తుతం అతడు యథావిధిగా బడికి వెళ్తూ తోటి స్నేహితులతో సరదాగా ఆడుకుంటున్నాడు.

ఈ వింత ఘటనపై జిల్లా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ దేవేంద్ర ప్రతాప్ పటేల్ వివరణ ఇస్తూ.. “కరణ్‌ను కుక్క కరిచింది చేతిపై కావడంతో రేబిస్ వైరస్ మెదడుకు చేరడానికి చాలా సమయం పట్టింది. అదే మెడ లేదా ఛాతీ భాగంలో కరిచి ఉంటే బతకడం కష్టమయ్యేది. పైగా, ఆ కుక్క ముందే టీకాలు తీసుకున్న పెంపుడు కుక్క అయి ఉండవచ్చు.

అందుకే 4 నెలల తర్వాత లక్షణాలు బయటపడ్డాయి. కుక్క కాటు గురించిన విపరీతమైన భయం, మానసిక ఒత్తిడి (ఫోబియా) కారణంగానే అతడు కుక్కలా మొరిగి ఉండవచ్చు” అని తెలిపారు. రేబిస్ బారినపడిన ఒక వ్యక్తి ఇలా ప్రాణాలతో బయటపడటం వైద్య చరిత్రలోనే ఒక అరుదైన అద్భుతంగా భావిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *