కుక్కలు మీపై పాదాలు ఎందుకు పెడతాయో తెలుసా? ఇది ఆట కాదు, మనసులోని మూగ మాట!

కుక్కలు అత్యంత విశ్వాసం గల జంతువులు. ఇంట్లోని వారితో ఎంతో స్నేహంగా ఉంటూ, వారి నమ్మకాన్ని, ప్రేమిని త్వరగా గెలుచుకుంటాయి. యజమాని ఇంటికి రాగానే వారిపై గెంతడం, ప్రేమగా అరవడం వంటివి చేస్తూ తమ ప్రేమను చాటుకుంటాయి.

అదేవిధంగా, కుక్కలు వచ్చి తమ పాదాలను మన చేతిపై లేదా ఒంటిపై ఉంచడం మనం చూస్తుంటాం. సాధారణంగా మనం వాటికి “గివ్ పా” (Give Paw) అని షేక్ హ్యాండ్ ఇవ్వడం నేర్పిస్తుంటాం. అలా చేసినప్పుడు అవి ఏదో తినడానికి అడుగుతున్నాయని లేదా మనం నేర్పిన ట్రిక్ చేస్తున్నాయని అనుకుంటాం. కానీ, కుక్కలు వాటంతట అవే వచ్చి పాదాలు వేయడం వెనుక లోతైన అర్థం ఉందని జంతు ప్రవర్తనా నిపుణులు చెబుతున్నారు.

ఇది కేవలం ఆట కాదు.. ఒక సంకేతం! మాట్లాడలేని కుక్కలు తమ భావాలను శరీర భాష (Body Language) ద్వారా వ్యక్తపరుస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కుక్కలు మీపై పంజా వేయడం వెనుక ఉన్న కొన్ని కారణాలు:

  • గమనాన్ని ఆకర్షించడం: “నా వైపు చూడండి”, “నాకు ఏదో కావాలి” లేదా “నాకు ఏదో బాలేదు” అని చెప్పడానికి అవి మీపై పాదం వేస్తాయి.
  • ప్రేమ మరియు భద్రత: మీరు వాటిని ప్రేమగా నిమరాలని లేదా వాటికి మీ తోడు కావాలని కోరుకున్నప్పుడు ఇలా చేస్తాయి.
  • ఒత్తిడి లేదా ఆందోళన: కుక్కలు భయపడినా లేదా ఒత్తిడికి గురైనా శారీరక స్పర్శ కోసం ప్రయత్నిస్తాయి. ఒకవేళ కుక్క పంజా గట్టిగా ఉంటే, అది ఏదో ఆందోళనలో ఉందని అర్థం.

బంధం బలపడుతుంది: మనుషుల మాదిరిగానే కుక్కలు కూడా సామాజిక జీవులు. ఈ స్పర్శ సమయంలో కుక్కలో మరియు మనిషిలో ‘ఆక్సిటోసిన్’ (Oxytocin) అనే హార్మొన్ విడుదలవుతుంది. దీనిని “బాండింగ్ హార్మొన్” అని కూడా పిలుస్తారు. ఇది మనిషికి, కుక్కకు మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.


Posted

in

by

Tags: