“కుటుంబానికి ఆఖరి వారసుడు..” 8 ఏళ్ల కొడుకును, తల్లినీ కిరాతకంగా చంపిన యువకుడు.. ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ తెచ్చిన ఘోరం.. ఒళ్లు గగుర్పొడిచే నిజాలు.!!

34 ఏళ్ల ఉపాధ్యాయురాలు సునీత, భర్త చనిపోయిన తర్వాత తన 8 ఏళ్ల కుమారుడు కావ్యాంశ్‌తో కలిసి నివసిస్తోంది.

ఈ క్రమంలో, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఛత్రపాల్ సింగ్ సింగౌర్ అనే యువకుడు.. తనకు ఇంకా పెళ్లి కాలేదని, సునీతను పెళ్లి చేసుకుని ఆమె బాబును కంటికి రెప్పలా చూసుకుంటానని నమ్మబలికాడు.

అయితే, ఛత్రపాల్ సింగ్ గుట్టుచప్పుడు కాకుండా మరో మహిళను పెళ్లి చేసుకున్న విషయం సునీతకు తెలిసింది. తనను కూడా పెళ్లి చేసుకోవాలని సునీత నిలదీయడంతో, ఆమెను మాటల్లో పెట్టి తన గ్రామానికి రప్పించాడు. అనంతరం ఛత్రపాల్ సింగ్.. సునీతను, ఆమె 8 ఏళ్ల కొడుకును అత్యంత కిరాతకంగా హతమార్చాడు.

హత్య అనంతరం ఆధారాలు దొరకకుండా చేసేందుకు, ఇద్దరి మృతదేహాలను చీరలతో చుట్టి, గోనెసంచుల్లో కుక్కి, బండరాళ్లు కట్టి రెండు వేర్వేరు బావుల్లో పడేశాడు. సునీత ఇంట్లో ఉన్న నగలు, నగదు మరియు ముఖ్యమైన పత్రాలతో అక్కడికి వచ్చిన సమయంలోనే ఈ ఘోరం చోటుచేసుకుంది. తాత, తండ్రి ఇప్పటికే చనిపోగా, కుటుంబానికి మిగిలిన ఏకైక చివరి వారసుడైన ఆ చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోవడంతో, ఇప్పుడు ఆ ఇంట్లో వృద్ధురాలైన నానమ్మ మాత్రమే దిక్కుతోచక ఒంటరిగా విలపిస్తోంది. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags: