కర్నాల్: హర్యానాలోని కర్నాల్‌లో ఒక విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రముఖ సంస్థలో పనిచేస్తున్న శాస్త్రవేత్త ఇంట్లోకి చొరబడిన కృష్ణకాంత్ అనే స్కూల్ వ్యాన్ డ్రైవర్, అక్కడున్న శాస్త్రవేత్త వృద్ధ తల్లిని గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించి, దోపిడీకి పాల్పడ్డాడు.
సెంట్రల్ సాయిల్ సెలైనిటీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSSRI) రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో శుక్రవారం జరిగిన ఈ ఘటన అంతా అక్కడి కెమెరాలో రికార్డ్ అయ్యింది. ‘దైనిక్ భాస్కర్’ కథనం ప్రకారం.. నిందితుడు ఇంట్లోకి ప్రవేశించి ఆ వృద్ధురాలి మెడలోని గొలుసును లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో, నిందితుడు ఆమె నోటిని రుమాలుతో మూసివేసి, నేలపైకి తోసి గొంతు నులిమినట్లు తెలుస్తోంది.
వృద్ధురాలి కేకలు విన్న ఇరుగుపొరుగు వారు వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కేసు నమోదు
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వైరల్ వీడియో
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
