మహారాష్ట్రలో తలపెట్టిన ‘విరార్ – అలీబాగ్’ (Virar – Alibaug) ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ వివరాలను ముందే తెలుసుకుని, ప్రభుత్వం నిర్ణయించే కోట్ల రూపాయల పరిహారాన్ని అక్రమంగా కాజేయాలని పథకం పన్నిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
షాకింగ్ మోసం:
భవిష్యత్తులో రానున్న హైవే ప్రాజెక్ట్ మ్యాప్ మరియు భూమి వివరాలను రహస్యంగా సేకరించిన ఈ ముఠా, ఎలాంటి అనుమతులు లేకుండా అతి తక్కువ సమయంలో దాదాపు 1,600 ఇళ్లను అత్యవసరంగా నిర్మించడం ప్రభుత్వ యంత్రాంతాన్ని విస్మయానికి గురిచేసింది.
ప్రభుత్వం తరఫున రోడ్డు విస్తరణ పనుల కోసం భూములు సేకరించేటప్పుడు, అక్కడ ఇప్పటికే ఉన్న ఇళ్లు మరియు భవనాలకు అనేక రెట్లు ఎక్కువ నష్టపరిహారం (Compensation) లభిస్తుందనే నిబంధనను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఈ కేటుగాళ్లు ప్లాన్ చేశారు.
పోలీసుల దర్యాప్తు మరియు అరెస్ట్:
దీనికోసం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, తాత్కాలిక గుడిసెలను మరియు ఇళ్లను హడావుడిగా నిర్మించి ప్రభుత్వ కళ్ళలో మట్టి కొట్టి డబ్బు కొల్లగొట్టాలని చూసిన వీరి కుట్ర ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై రహస్య సమాచారం అందుకున్న జిల్లా యంత్రాగం మరియు పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆకస్మిక తనిఖీల్లో ఈ భారీ మోసం బట్టబయలైంది. దీనికి సూత్రధారులైన నలుగురు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజల కష్టార్జితమైన పన్ను సొమ్మును అక్రమ మార్గాల్లో దోచుకోవాలని చూసిన ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇలాంటి ప్రభుత్వ ప్రాజెక్టు ప్రాంతాలలో జరిగే అక్రమాలను అరికట్టడానికి పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.

Leave a Reply