మార్చి 1 నుండి వాట్సాప్‌లో ‘సిమ్ బైండింగ్’ నిబంధన అమలులోకి రానుంది. దీని ప్రకారం, మీరు ఏ నంబర్‌తో అయితే వాట్సాప్ వాడుతున్నారో, ఆ సిమ్ కార్డు తప్పనిసరిగా అదే ఫోన్లో ఉండాలి. ఈ మార్పు నేపథ్యంలో ప్రతి వాట్సాప్ యూజర్ చేయాల్సిన 3 ముఖ్యమైన పనులు ఇవే:
1. ప్రైమరీ సిమ్‌ను ఖరారు చేసుకోండి: చాలామంది తమ ఫోన్లో లేని నంబర్‌తో లేదా ప్రస్తుతం వాడకంలో లేని పాత నంబర్‌తో వాట్సాప్ వాడుతుంటారు. ఇకపై ఇది సాధ్యం కాదు. సిమ్ బైండింగ్ తర్వాత, ఫోన్ నుండి సిమ్ తీసేస్తే వాట్సాప్ కూడా పనిచేయదు. కాబట్టి, మీరు శాశ్వతంగా వాడాలనుకునే నంబర్‌ను ఇప్పుడే నిర్ణయించుకోండి.
2. సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోండి: కొందరు రీఛార్జ్ చేయకుండా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న నంబర్లపై వాట్సాప్ వాడుతుంటారు. కానీ ఇకపై వాట్సాప్ ఎప్పటికప్పుడు సిమ్ మరియు అకౌంట్‌ను వెరిఫై చేస్తుంది. కాబట్టి మీ సిమ్ కార్డుకు వాలిడిటీ ఉండేలా రీఛార్జ్ చేసుకోండి. ఒకవేళ మీ నంబర్ ఇన్‌యాక్టివ్‌గా ఉండి, టెలికాం కంపెనీ దానిని వేరొకరికి కేటాయిస్తే, మీ వాట్సాప్ డేటా కోల్పోయే ప్రమాదం ఉంది.
3. చాట్ బ్యాకప్ తీసుకోండి: ఈ కొత్త నిబంధన వల్ల మీ చాట్స్ మరియు డేటా పోకుండా ఉండాలంటే, వెంటనే బ్యాకప్ తీసుకోండి.
- Settings > Chats > Chat Backup లోకి వెళ్లి ‘Include Videos’ ఆన్ చేసి, ‘Back up now’ క్లిక్ చేయండి.
