కేవలం ₹10,000 ఆశతో ₹1.80 కోట్లు కోల్పోయిన రైతు! రైతుకు నకిలీ బాబా పంపిన వీడియోతో వెలుగులోకి వచ్చిన దారుణం.. పోలీసుల రంగప్రవేశం..!!!

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో క్షుద్రపూజలు, తంత్ర విద్యల ద్వారా డబ్బును రెట్టింపు (డబుల్) చేసి ఇస్తామని నమ్మించి ఒక మౌలానా (నకిలీ బాబా) ఒక అమాయక రైతు నుండి ఏకంగా ₹1.80 కోట్లు కాజేసిన షాకింగ్ మోసపూరిత ఉదంతం వెలుగులోకి వచ్చింది.

బాధిత రైతు తనకున్న సొంత భూమిని విక్రయించడం ద్వారా, అలాగే బంధువుల దగ్గర అప్పులు చేయడం ద్వారా ఈ భారీ మొత్తాన్ని సమకూర్చుకున్నాడు. నిందితుడైన సదరు మౌలానా మరియు అతని అనుచరులు.. నోట్ల కట్టల ముందు కూర్చుని ప్రత్యేక క్షుద్రపూజలు, తంత్ర మంత్రాలు చేస్తున్నట్లు ఉన్న ఒక నకిలీ వీడియోను రైతుకు పంపి, అతడిని పూర్తిగా నమ్మించారు.

మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు:

ప్రస్తుతం ఆ క్షుద్రపూజల వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తా తాను దారుణంగా మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన ఆ రైతు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల హెచ్చరిక:

ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ నకిలీ బాబా (మౌలానా) మరియు ఈ భారీ దందాలో అతనికి సహకరించిన అనుచరులను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను (స్పెషల్ టీమ్స్) రంగంలోకి దించి గాలిస్తున్నారు.

ఇలా డబ్బులు రెట్టింపు చేస్తామంటూ అమాయక ప్రజలను బురిడీ కొట్టించే నకిలీ బాబాలు, మంత్రగాళ్లు మరియు కేటుగాళ్ల వలలో పడి మోసపోవద్దని, డబ్బు విషయాలలో అత్యంత అప్రమత్తంగా మరియు వివేకంతో వ్యవహరించాలని పోలీసులు ప్రజలను గట్టిగా హెచ్చరిస్తున్నారు.


Posted

in

by

Tags: