ఆధార్ కార్డు ఉన్న వారందరికీ జూలై 1, 2026 నుండి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ ఖాతా లావాదేవీల స్టేట్మెంట్లను సులభంగా పొందడానికి ఈమెయిల్ అడ్రస్ చాలా ముఖ్యం. ఆధార్ కార్డుతో అనుసంధానించబడిన ఈమెయిల్ అడ్రస్‌ను అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మరింత సులభతరం చేసింది.
ఉచిత అప్డేట్ ఆఫర్: సాధారణంగా ఆధార్ కార్డులో ఈమెయిల్ అడ్రస్ అప్డేట్ చేయడానికి రూ. 75 రుసుము ఉంటుంది. అయితే, జూలై 1, 2026 నుండి డిసెంబర్ 31, 2026 వరకు ఈ సేవను ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా పొందవచ్చు.
అప్డేట్ చేసే విధానం (కొత్త ఆధార్ యాప్ ద్వారా):
- ‘న్యూ ఆధార్ యాప్’ (New Aadhaar App) డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి.
- ఆధార్ నంబర్ మరియు ‘ఫేస్ అథెంటికేషన్’ (Face Authentication) ఉపయోగించి లాగిన్ అవ్వండి.
- హోమ్ పేజీలో ఉన్న ‘సర్వీసెస్’ (Services) ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- అందులో ‘ఈమెయిల్ యాడ్/అప్డేట్’ (Email Add/Update) ఆప్షన్‌ను ఎంచుకోండి.
- కొత్త ఈమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేసి, ఓటీపీ (OTP) ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయండి.
- చివరిగా, ఫేస్ అథెంటికేషన్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేసి సబ్మిట్ చేయండి.
ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఛార్జ్ రూ. 0 అని చూపిస్తుంది. అప్డేట్ విజయవంతంగా పూర్తయిన తర్వాత మీకు మెసేజ్ మరియు ఈమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది.
ముఖ్య గమనిక: ఈ అప్డేట్ ప్రక్రియ గరిష్టంగా 15 రోజుల్లోపు పూర్తవుతుంది (చాలామందికి ఒక వారంలోనే పూర్తవుతుంది). డిసెంబర్ 31, 2026 వరకు మాత్రమే ఈ ఉచిత సేవ అందుబాటులో ఉంటుంది, కాబట్టి లోపు పూర్తి చేసుకోండి.
