క్యాటరింగ్ పనికి వచ్చిన మహిళ కోసం పెళ్లినే ఆపేసిన పెళ్లికూతురు..! “ముక్కులోంచి కారిన రక్తం”.. పెళ్లి దుస్తుల్లోనే పరుగున వచ్చి ప్రాణాలు కాపాడింది.. ఈ మంచి మనసు ఎవరికి వస్తుంది..?

పెళ్లి పీటలపై కూర్చోవడం అనేది ప్రతి అమ్మాయి జీవితంలోనూ ఎంతో ముఖ్యమైన, అత్యంత సంతోషకరమైన మధుర క్షణం. కానీ, ఆ పెళ్లి దుస్తుల్లోనే ఉంటూ తన వైద్య వృత్తి ధర్మాన్ని నిలబెట్టి శభాష్ అనిపించుకుంది ఓ నవవధువు.

తన పెళ్లి వేడుకలోనే అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయిన మహిళలకు పెళ్లి పీటల మీదున్న నవవధువు వెంటనే ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు నిలిపిన ఘటన ప్రస్తుతం నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోంది.

కేరళలోని కన్నూర్ జిల్లా పానూర్‌కు చెందిన డాక్టర్ షిరిన్ సుబైర్, డాక్టర్ రిజాస్‌ల వివాహం బంధుమిత్రుల కోలాహలం నడుమ ఎంతో ఘనంగా జరుగుతోంది. పెళ్లి ఆచారాలు, విందు వినోదాలతో పెళ్లి మండపమంతా సందడిగా ఉన్న ఆ సమయంలో.. భోజనాలు వడ్డించే క్యాటరింగ్ పనుల్లో ఉన్న ఇద్దరు మహిళలు హఠాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒక మహిళ ముక్కులోంచి ఒక్కసారిగా రక్తం కారడం మొదలవ్వగా, మరో మహిళకు తీవ్రమైన తలతిరుగుడు వచ్చి అక్కడే కుప్పకూలిపోయే పరిస్థితి ఏర్పడింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *