“క్యాన్సర్ తర్వాత మేము వెతికిన ఆ ఒక్క విషయం..!” తండ్రి, మామగారి మరణశయ్యపై పుట్టిన ఒక గొప్ప ప్రకృతి ఆహార విప్లవం.. టీచర్ గాయత్రి కన్నీళ్లతో ప్రారంభించిన హరిత పయనం..!!!

జీవితం మనకు ఎప్పుడు, ఏ పాఠాన్ని నేర్పుతుందో ఎవరూ ఊహించలేరు; కొందరికి అది విజయంతో మొదలవుతుంది, చాలా మందికి అది బాధ నుండి పుడుతుంది. కడలూరుకు చెందిన 38 ఏళ్ల గాయత్రి కథ కూడా అలాంటిదే.

బి.ఎస్సీ, బి.ఎడ్ చదివి, ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం కోసం టీఆర్‌బీ (TRB) పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించి, ఒక ప్రభుత్వ పాఠశాలలో చాక్ పీస్ పట్టుకుని తన జీవితాన్ని ప్రారంభిస్తుందని ఆశించిన ఒక మహిళ.. ఈ రోజు తన భర్త రాజ్‌ప్రభు మద్దతుతో ఒక హరిత విప్లవానికి చిరునామాగా మారింది.

దీని వెనుక ఒక ఉపాధ్యాయురాలి పట్టుదల మాత్రమే కాదు, తన తండ్రి మరియు మామగారు క్యాన్సర్ బారిన పడి మరణశయ్యపై ఉన్నప్పుడు మిగిల్చిన ఆవేదనతో కూడిన అన్వేషణ, “మనం తినే ఆహారంలో ఏదో ఒక విషం దాగి ఉంది” అనే తల్లి ఆలోచనే ఇందుకు కారణం. తన కుటుంబం అనుభవించిన మరణ వేదనకు మందుగా ప్రారంభించిన ఆ అన్వేషణ ఫలితంగా, ఇంటిలోని ఒక చిన్నపాటి షెడ్‌లో ట్రేలలో 7 నుండి 14 రోజులలోపు కోతకు వచ్చే ‘మైక్రోగ్రీన్స్’ (Microgreens – నుణ్ణుకూరలు/చిరుకూరలు) పెంపకాన్ని ఆమె చేపట్టారు.

పూర్తిగా పెరిగిన ఆకుకూరల కంటే 40 రెట్లు ఎక్కువ పోషకాలు, విటమిన్లు ఉండే ఈ లేత మొక్కలలో.. ప్రోటీన్లు అధికంగా ఉండే పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్), బరువు తగ్గించే ఉలవలు, జీర్ణక్రియను పెంపొందించే పెసలు, టాక్సిన్లను తొలగించే బ్రోకలీ, కాలేయాన్ని రక్షించే ముల్లంగి, హిమోగ్లోబిన్ పెంచే గోధుమ గడ్డి (వీట్‌గ్రాస్), కండరాల పెరుగుదలకు తోడ్పడే శనగలు, కంటి ఆరోగ్యానికి మేలు చేసే బఠానీలు, రక్తహీనతను నివారించే చిన్న తోటకూర, పాలిచ్చే తల్లులకు ఎంతో మంచిదైన మెంతులు, జలుబును తగ్గించే ఆవాలు, గ్యాస్ సమస్యను దూరం చేసే వాము వంటి పకృతి వైద్య గుణాలున్న మొక్కలన్నింటినీ పచ్చదనం చెదరకుండా పెంచుతున్నారు.

వీటిని చక్కటి చిన్న డబ్బాలలో ప్యాక్ చేసి చెన్నై, పుదుచ్చేరి, కోయంబత్తూర్, ఈరోడ్, కారైకాల్, శీర్కాళి, మయిలాడుతురై వంటి ప్రధాన నగరాలకు వేగంగా సరఫరా చేస్తున్నారు. ఒక పక్కా ప్లాన్ ప్రకారం వ్యాపారం చేస్తూ ఇంటి వద్ద నుంచే నెలకు 30 వేల రూపాయల లాభాన్ని ఆర్జిస్తున్న గాయత్రి ప్రయాణం, బాధ నుండి కొత్త బాటను వెతుక్కున్న ఒక గొప్ప హరిత అన్వేషణ.


Posted

in

by

Tags: