తిరునెల్వేలి ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని, అర్ధరాత్రి వేళల్లో ఇళ్లలోకి అక్రమంగా చొరబడి వారిని అశ్లీలంగా ఫోటోలు తీసే దారుణ చర్యకు పీర్ మహమ్మద్ (23) అనే యువకుడు పాల్పడుతున్నాడు.
గత కొన్ని రోజులుగా నిరంతరం జరుగుతున్న ఈ అక్రమ చర్య వల్ల ఆ ప్రాంత మహిళలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.
ఈ క్రమంలో, ఎప్పటిలాగే అర్ధరాత్రి ఒక ఇంట్లోకి చొరబడి నిద్రపోతున్న ఒక మహిళను ఫోటో తీసేందుకు ప్రయత్నించగా, ఆ యువకుడు పట్టుబడ్డాడు. కేకలు విని పరుగెత్తుకొచ్చిన పొరుగువారు అతడిని పట్టుకుని విచక్షణారహితంగా దేహశుద్ధి చేసి నెల్లై పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ యువకుడిని అరెస్టు చేసి తీవ్రంగా విచారిస్తున్నారు.

Leave a Reply