“గాలిపటం పట్టుకోవాలని ఆశపడి వైరును తాకిన బాలుడు”.. విద్యుత్ సరఫరా అయి దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన వైనం.. కలచివేస్తున్న షాకింగ్ వీడియో.!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్ ప్రాంతానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన 12 ఏళ్ల బాలుడు, తెగిపోయిన గాలిపటం పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడుహై-టెన్షన్ విద్యుత్ తీగపై చేయి తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు.

ఈ సంఘటనకు సంబంధించిన గుండెల్ని పిండేసే వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ తీవ్ర విషాదాన్ని నింపాయి.

ఒక గాలిపటం కోసం తన అమూల్యమైన ప్రాణాలను పణంగా పెట్టడం చాలా ప్రమాదకరమని, విద్యుత్ తీగలు ఉండే ప్రదేశాలలో పిల్లలు గాలిపటాలు ఎగరవేయకుండా లేదా తెగిపోయిన పతారాలను పట్టుకోవడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *