గుండె జారిపోయింది! అకస్మాత్తుగా అడ్డువచ్చిన వీధి కుక్క.. బ్రేక్ వేసిన క్షణంలో దారుణం.. స్కూటర్‌పై వెళ్తున్న మహిళకు ఎదురైన ఘోరం.. వణికించే వీడియో..!!

కేరళ రాష్ట్రం త్రిస్సూర్ జిల్లా పరిధిలో, వీధి కుక్క అడ్డురావడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో స్కూటర్ నడుపుతున్న మహిళ దారుణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

స్కూటర్‌పై వెళుతుండగా అకస్మాత్తుగా రోడ్డుకు అడ్డంగా పరుగెత్తుకొచ్చిన వీధి కుక్కను ఢీకొట్టకుండా ఉండేందుకు బ్రేక్ వేయడంతో, స్కూటర్ అదుపుతప్పి కిందపడి ప్రమాదానికి గురైంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో విడుదలై చూసేవారిని వణికించేలా చేశాయి. అందులో, మహిళ స్కూటర్‌పై వస్తుండగా కుక్క అడ్డురావడం, ఆమె అదుపుతప్పి కింద పడిపోవడం రికార్డయ్యాయి.

అదే సమయంలో, కిందపడి రోడ్డుపై జారిపోతూ వెళ్లిన కుక్క, ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టిన షాకింగ్ దృశ్యాలు కూడా ఆ వీడియోలో రికార్డయ్యాయి.

రోడ్లపై అకస్మాత్తుగా అడ్డువచ్చే వీధి కుక్కల వల్ల జరుగుతున్న ప్రమాదాలు, అందులో బలవుతున్న మనుషుల ప్రాణాలు.. స్థానిక ప్రజల్లో తీవ్ర విషాదాన్ని, భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి.


Posted

in

by

Tags: