గుండెలు పిండేసే దారుణం!. వీధి కుక్కలను నదిలో విసిరేసిన తాత-మనవడు.. నెటిజన్ల ఆగ్రహం.. వైరల్ వీడియో..!!!

హరియాణా: హరియాణాలో ఒక వృద్ధుడు మరియు అతని మనవడు కలిసి, వీధి కుక్కలను పట్టుకుని నదిలో విసిరేస్తున్న దృశ్యాలు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేగింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వెలుగుచూడటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించిన ఈ అమానుష చర్యపై నెటిజన్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వీడియోను చూసిన చాలామంది సోషల్ మీడియాలో హరియాణా పోలీసులను ట్యాగ్ చేస్తూ, ఇలాంటి అమానుషమైన చర్యకు పాల్పడిన తాత-మనవళ్లపై వెంటనే కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. “ఇది చాలా క్రూరమైన పని” అని పేర్కొంటూ, దోషులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Posted

in

by

Tags: