దిస్పూర్ (అస్సాం): అస్సాం రాష్ట్రంలో 10 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు సామూహిక లైంగిక దాడికి (గ్యాంగ్ రేప్) పాల్పడి, ఆపై అత్యంత దారుణంగా హత్య చేసిన ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని రేకెత్తించింది.
అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. అస్సాంలోని ఒక ప్రాంతంలో సదరు బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు మైనర్ బాలురు గమనించారు. ఎవరూ లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడి ఈ ఘోరానికి ఒడిగట్టారు. అనంతరం బాలిక మృతదేహాన్ని దాచిపెట్టి, తమ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్లాన్ చేశారు. సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి, కుమార్తె నిర్జీవంగా పడి ఉండటం గమనించి కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
పోక్సో (POCSO) కింద కేసు నమోదు..
ఈ దారుణ ఘటనపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. పోక్సో (POCSO) చట్టంతో పాటు పలు కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం తీవ్రంగా గాలించి, ఈ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురు మైనర్ బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం వారిని జువైనల్ కోర్టులో (సెంతు కోర్టు) హాజరుపరిచి, అక్కడి నుండి బాలల పరిశీలన గృహానికి (జువైనల్ హోమ్) తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీయగా.. అపరాధులకు చట్టప్రకారం కఠినాతికఠినమైన శిక్ష పడేలా చూడాలని ప్రజల నుండి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply