“గూగుల్‌లో ఇవేనా వెతికింది? – ప్రియుడితో కలిసి పథకం ప్రకారం.. పుణె రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో షాకింగ్ విషయాలు!!”

పుణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో, ఆయన కాబోయే భార్య సియా గోయల్ మరియు ఆమె ప్రియుడు చేతన్ చౌదరిల కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విచారణలో భాగంగా, కేతన్‌ను కొండ పైనుండి ఎలా నెట్టి చంపారో సియా పోలీసుల సమక్షంలో చేసి చూపించింది.

కాబోయే భర్త కేతన్ అంటే సియాకు ఇష్టం లేదు. అతడిని అడ్డు తొలగించుకుని, తన ప్రియుడు చేతన్‌ను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసింది. గత 7 నెలల్లోనే ఈ జంట 2,004 సార్లు ఫోన్లో మాట్లాడుకుని, సుమారు 238 గంటల పాటు హత్య గురించి చర్చించినట్లు విచారణలో తేలింది. మే 31, జూన్ 4 మరియు జూన్ 14న కేతన్‌ను చంపేందుకు ప్రయత్నించి విఫలమైన ఈ జంట, చివరకు జూన్ 18న పక్కా ప్లాన్‌తో అతడిని కొండ పైనుండి నెట్టి చంపేసింది.

సంఘటన జరిగినప్పుడు, “ఫోటోలు తీస్తుండగా కేతన్ కాలు జారి కింద పడిపోయాడు” అని సియా కన్నీటి నాటకం ఆడింది. కానీ అక్కడి సిసిటివి దృశ్యాలను పరిశీలించినప్పుడు అసలు విషయం బయటపడింది. సియా వెనుక హుడీ (Hoodie) వేసుకున్న ఒక వ్యక్తి రావడం, కేతన్ అటు తిరిగినప్పుడల్లా ఆ వ్యక్తి దాక్కోవడం కనిపించింది. ఆ వ్యక్తి చేతన్ అని తేలడంతో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు.

క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్: నిందితులను లోహాగఢ్ కోటకు తీసుకెళ్లిన పోలీసులు ‘క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్’ నిర్వహించారు. హత్యకు ముందే సియా, చేతన్ అనేకసార్లు అదే కోటకు వచ్చి ప్రాక్టీస్ చేసినట్లు తేలింది.

డిజిటల్ ఆధారాలు ధ్వంసం: కేతన్‌ను ఎలా చంపాలన్న దానిపై ఈ జంట గూగుల్‌లో రకరకాలుగా వెతికింది. పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ఇద్దరూ మారువేషాల్లో వచ్చారు. క్రైమ్‌కు ముందు, తర్వాత వారి ఫోన్లలోని చాటింగ్ హిస్టరీని మరియు గూగుల్ సెర్చ్ హిస్టరీని వారు పూర్తిగా డిలీట్ చేశారు. ఆ డిజిటల్ ఆధారాలను రికవర్ చేయడానికి ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్లను సరిచూసుకోవడానికి ఈ రీకన్‌స్ట్రక్షన్ ఉపయోగపడుతుందని పుణె ఎస్పీ సందీప్ సింగ్ గిల్ తెలిపారు.


Posted

in

by

Tags: