ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన మజీద్ అనే యువకుడు రోజంతా తన మొబైల్ ఫోన్లో పబ్జీ (BGMI/PUBG) గేమ్ ఆడే అలవాటు కలిగి ఉన్నాడు.
వరుసగా గంటల తరబడి గేమ్ ఆడటంతో ఫోన్ విపరీతంగా వేడెక్కి (Overheating), చేతితో పట్టుకోలేనంత స్థితికి చేరింది.
అయితే, దానిని ఏమాత్రం పట్టించుకోని మజీద్.. అంత వేడిగా ఉన్న ఫోన్ను అలాగే తన ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే జేబులోంచి దట్టమైన పొగ రావడం ప్రారంభమై, క్షణాల్లో పెను శబ్దంతో మొబైల్ ఫోన్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో అతని చేతులు కాలిపోవడంతో పాటు మర్మంగాలకు (ప్రైవేట్ పార్ట్స్కు) తీవ్ర గాయాలయ్యాయి.
సమీపంలో ఉన్న స్థానికులు వెంటనే అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ ఫోన్ కొనుగోలు చేసిన కొద్ది రోజులకే ఈ ప్రమాదం జరిగింది. అధికంగా గేమ్స్ ఆడటం వల్ల ఫోన్ బాగా వేడెక్కితే, వెంటనే దాన్ని వాడటం ఆపివేయాలని, జేబుల్లో పెట్టుకోకూడదని టెక్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply