గోల్డ్ ప్రైస్: బంగారం, వెండి ధరలు భారీగా తగ్గనున్నాయి.. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్య మలుపు!

బంగారం ధర 3 నుండి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. INVasset PMS సంస్థకు చెందిన హర్షల్ దసాని అంచనా ప్రకారం, అమెరికా – ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరితే బంగారం ధర భారీగా తగ్గుతుందని, వెండి ధర 5 – 8% వరకు భారీ క్షీణతను చూడవచ్చని తెలిపారు.

గత రెండు రోజుల క్రితం వరకు బంగారం ధరలు వేగంగా పెరిగాయి. ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా ధరలు ఇంకా పెరుగుతాయని భావించినప్పటికీ, గత రెండు రోజులుగా బంగారం ధర తగ్గడం ప్రారంభమైంది. ఈరోజు ఒక్కరోజే బంగారం ధర రూ.1,560 తగ్గి శుభవార్త అందించింది.

ధరల తగ్గుదలకు కారణాలు:

  1. పెట్టుబడిదారుల ధోరణి: యుద్ధ మేఘాల మధ్య పెట్టుబడిదారులు బంగారంపై దృష్టి తగ్గించి, క్రూడ్ ఆయిల్ మరియు అమెరికన్ డాలర్‌పై పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు.
  2. అమెరికన్ డాలర్ ఆధిపత్యం: డాలర్ విలువ ఐదు వారాల గరిష్ట స్థాయికి చేరడంతో బంగారం ధరల పెరుగుదల కట్టడి చేయబడింది.
  3. రాజకీయ వ్యూహాలు: అమెరికా – ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు ఉండటంతో “సేఫ్ హెవెన్ ప్రీమియం” తగ్గడం మొదలైంది.

నిపుణుల హెచ్చరిక: ఒకవేళ యుద్ధం మళ్ళీ తీవ్రమైతే, భారత మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,70,000 కు, కిలో వెండి ధర రూ.3,00,000 కు చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *