“చట్టాలు లేవు.. ఆచారాలు లేవు!”.. పెళ్లి అనే బంధమే లేని విచిత్ర సమాజం.. నేటికీ రాతియుగం నాటి జీవన విధానాన్ని కొనసాగిస్తున్న ఆఫ్రికా ఆదిమ తెగ!

ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో నివసిస్తున్న ‘హడ్జా’ (Hadza) అనే విచిత్రమైన ఆదిమ తెగ ప్రజలు.. రాతియుగం (కృత్రిమ నాగరికత లేని కాలం) నాటి నుండి నేటి డిజిటల్ యుగం వరకు ఎలాంటి మార్పులు లేకుండా, ఇప్పటికీ తమ సాంప్రదాయ వేట మరియు ఆహార సేకరణ ఆధారిత జీవన విధానాన్ని అలాగే కొనసాగిస్తున్నారు.

ఉత్తర మధ్య టాంజానియాలోని ‘ఏయాసి’ (Eyasi) సరస్సు చుట్టుపక్కల దాదాపు 4,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నివసిస్తున్న ఈ విలక్షణ తెగ ప్రజల జనాభా ప్రస్తుతం కేవలం 1,200 నుండి 1,300 మంది వరకు మాత్రమే మిగిలి ఉంది. కొండ గుహలలో, ఎత్తైన పీఠభూములపై పక్షి గూళ్ల లాంటి ఆకారంలో చిన్న చిన్న ఇళ్లను నిర్మించుకుని జీవించే ఈ సమాజంలో.. వీరందరినీ నియంత్రించడానికి ఎలాంటి నాయకుడు (లీడర్) కానీ లేదా అధికారిక వ్యవస్థ కానీ ఉండవు.

ముఖ్యంగా, వీరి సమాజంలో మనలాంటి పద్ధతి ప్రకారం జరిగే వివాహ బంధాలు గానీ, పెళ్లి ఆచారాలు, శాస్త్రాలు గానీ అసలు లేవు. దానికి బలిగా, రాత్రి వేళల్లో మంటల (ఫైర్ క్యాంప్) చుట్టూ గుమిగూడే ఈ తెగకు చెందిన పురుషులు మరియు మహిళలు తమకు నచ్చిన వారితో పరస్పర అంగీకారంతో శారీరక, మానసిక సంబంధాలను ఏర్పరచుకుంటారు.

ఇక్కడ ఎలాంటి సాంప్రదాయక నియమ నిబంధనలకు కట్టుబడకుండా.. కేవలం పరస్పర ఇష్టంతో, ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ ఎక్కువ కాలం కలిసి జీవించే జంటలను మాత్రమే ఈ హడ్జా సమాజం భార్యాభర్తలుగా గుర్తిస్తుంది. ఒకవేళ ఇద్దరికీ పడకపోతే ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండానే చాలా సులభంగా విడిపోతారు కూడా.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *