“చదువుకోవడానికి వెళ్లిన చోట ప్రాణ భయం!” బడికి వెళ్లిన విద్యార్థులు.. ఒక్కసారిగా బోల్తా పడిన పడవ.. గుండెలు పగిలే దృశ్యాలు.!!

బీహార్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా పలు జిల్లాలు నీటమునిగి తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి.

ఈ క్రమంలో, వరద నీరు చుట్టుముట్టిన ప్రాంతంలో పాఠశాల పిల్లలు తమ ప్రాణాలను పణంగా పెట్టి పడవలో బడికి వెళ్తుండగా చోటుచేసుకున్ఈ భయానక ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

యూనిఫాం ధరించి, పుస్తకాల సంచులు భుజాన వేసుకుని పడవలో పాఠశాలకు వెళ్లిన చిన్నారులు, ఒడ్డుకు చేరుకునే సమయంలో ఊహించని విధంగా పడవ తలకిందులై బోల్తా పడింది. దీంతో పడవలో ఉన్న పిల్లలందరూ లోతైన వరద నీటిలో పడిపోయి మునిగిపోవడం ప్రారంభించారు.

చదువుకోవడానికి వెళ్లి ప్రాణాలతో పోరాడిన ఆ పసిపిల్లలు, తమకు తెలిసిన ఈత విద్యతో, కేకలు విని పరుగెత్తుకు వచ్చిన చుట్టుపక్కల గ్రామస్తుల సహాయంతో అదృష్టవశాత్తూ ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడ్డారు. “ఏటా వరదలు వస్తున్నప్పటికీ బడికి వెళ్లే పిల్లల భద్రత కోసం ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయడం లేదు” అని స్థానిక ప్రజలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *