“చనిపోయిన వాళ్ల ఆత్మలు కూడా క్షమించవురా..!” పోస్టుమార్టం గదిలో మందు పార్టీనా..? డెత్ సర్టిఫికెట్ కోసం బయట నిరీక్షణ, లోపల మద్యం విందు.. షాకింగ్ ఘటన.. వైరలవుతున్న వీడియో..!!

మహారాష్ట్రలోని పుణె సమీపంలో ఉన్న పింప్రి-చించ్‌వాడ్ వైసీఎం (YCM) ప్రభుత్వ ఆసుపత్రిలో, పోస్టుమార్టం చేసే గదిలోనే సిబ్బంది మరియు ఓ వైద్యుడు కలిసి మద్యం పార్టీ చేసుకున్న దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

చనిపోయిన తమ బంధువు డెత్ సర్టిఫికెట్ (మరణ ధృవీకరణ పత్రం) తీసుకోవడానికి వచ్చిన ఒక వ్యక్తిని, అక్కడి సిబ్బంది రాత్రంతా బయటే వేచి ఉండేలా చేశారు. సర్టిఫికెట్ ఇవ్వడానికి చాలా సమయం పడుతుండటంతో అనుమానం వచ్చిన ఆ వ్యక్తి అకస్మాత్తుగా పోస్టుమార్టం గదిలోకి వెళ్లి చూశాడు.

అక్కడ పోస్టుమార్టం చేసే టేబుల్‌పైనే మద్యం సీసాలు, మందు నింపిన గ్లాసులు, బిర్యానీ మరియు నంజుకోవడానికి ఇతర పదార్థాలు పెట్టుకుని కొందరు సరదాగా తాగుతుండటం చూసి షాక్‌కు గురైన అతడు.. వెంటనే ఆ తతంగాన్ని తన మొబైల్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

బంధువులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ప్రజలను బయట పడిగాపులు కాయించి, మృతదేహాలను ఉంచే గదిలోనే వైద్యాధికారి, సిబ్బంది ఇలా అసహ్యంగా ప్రవర్తించడం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై వైసీఎం ఆసుపత్రి యాజమాన్యం, పింప్రి-చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు తీవ్ర స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులైన వైద్యాధికారి మరియు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *