చలనంలో ఉన్న రైలులో యువతికి నరకం..! చొక్కా విప్పి అసభ్యంగా.. శరీర వెంట్రుకలు పీకి విసిరేస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భయంకర వీడియో!

భారతీయ రైల్వేలోని రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణించే మహిళలకు, ముఖ్యంగా సుదూర ప్రయాణాల్లో రక్షణ ఎంతవరకు ఉందనే ప్రశ్నను లేవనెత్తుతూ ఒక భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. కోర్బా – తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్‌లోని ‘S1’ స్లీపర్ కోచ్‌లో ఒక మహిళా ప్రయాణికురాలు ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో ఆ బోగీలో జనం తక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకున్న ఒక గుర్తుతెలియని వ్యక్తి, ఆమె దగ్గరకు వచ్చి అనుమతి లేకుండా కాళ్లను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.

భయపడిపోయిన ఆ మహిళ, అతడి నుండి దూరంగా జరిగి కిటికీ పక్కన కూర్చుంది. అయితే, ఆ కామాంధుడు అంతటితో ఆగకుండా తన బట్టలు విప్పి, అసభ్యకరమైన చేష్టలకు పాల్పడటమే కాకుండా.. తన శరీరంలోని వెంట్రుకలను పీకి ఆమె కూర్చున్న సీటుపై విసిరేస్తూ పైశాచికానందం పొందాడు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటనను ఆ ధైర్యవంతురాలైన మహిళ తన ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.


Posted

in

by

Tags: