వివాహం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం మాత్రమే కాదు, జీవితాన్నే మార్చేసే అతిపెద్ద మలుపు. అందుకే సరైన జీవిత భాగస్వామిని (Life Partner) ఎంచుకోవడం చాలా ముఖ్యం. జీవిత ప్రయాణంలో మీతో ఉండే భాగస్వామి సద్గుణవంతురాలైతే, ఆ ఇల్లు స్వర్గమవుతుంది.
అదే కొన్ని ప్రతికూల లక్షణాలు ఉన్నవారు మీ జీవితంలోకి ప్రవేశిస్తే, మీకు మనశ్శాంతి ఉండదని చాణక్యుడు హెచ్చరించాడు. అందుకే ప్రతి పురుషుడు వివాహానికి ముందే కొన్ని విషయాలను గమనించాలని, ముఖ్యంగా ఈ క్రింది లక్షణాలు ఉన్న స్త్రీలను వివాహం చేసుకోకూడదని ఆచార్య చాణక్యుడు సూచించారు. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం:
పురుషులు ఇలాంటి స్త్రీలను వివాహం చేసుకోకూడదట:
- అందంపై గర్వం ఉన్న స్త్రీ: చాణక్యుడి ప్రకారం, ఒక అమ్మాయి తన బాహ్య సౌందర్యం గురించి అతిగా గర్వపడుతుంటే, అటువంటి స్త్రీని వివాహం చేసుకోకూడదు. ఆమె కేవలం తన స్వార్థం గురించి మాత్రమే ఆలోచిస్తుంది మరియు ఇతరులను సంతోషంగా చూసుకోలేదు.
- ఇతరుల గురించి చెడుగా మాట్లాడే మహిళ: ఎప్పుడూ ఇతరుల గురించి తప్పుగా మాట్లాడే లేదా ఇతరుల పట్ల చెడు ఆలోచనలు కలిగి ఉండి, చాడీలు చెప్పే మహిళలకు దూరంగా ఉండాలి. అటువంటి మహిళలు కుటుంబంలో అశాంతిని కలిగిస్తారు. కాబట్టి అలాంటి వారి నుంచి దూరంగా ఉండటమే మంచిది.
- భౌతిక సుఖాలకే ప్రాధాన్యత ఇవ్వడం: ఇల్లు, కారు, నగలు, డబ్బు వంటి భౌతిక సౌకర్యాలకే ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయిలు తమ భర్త భావాలకు ఎన్నటికీ విలువ ఇవ్వలేరు. ఇటువంటి స్వార్థపరురాలిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం నరకయాతన అనుభవించాల్సి వస్తుందని ఆచార్య చాణక్య హెచ్చరించారు.
- ఇతరులను అవమానించడం: ఆచార్య చాణక్యుడి ప్రకారం, ఇతరులను నిరంతరం అవమానించే స్త్రీని ఎప్పుడూ వివాహం చేసుకోకూడదు. అటువంటి వారు తమ కుటుంబ గౌరవాన్ని కూడా కాపాడలేరు.
- అబద్ధాలు చెప్పే అలవాటు: నిరంతరం అబద్ధాలు చెబుతూ, చెడు మార్గాలను అనుసరించే అలవాటు ఉన్న స్త్రీని వివాహం చేసుకోకూడదు. ఆమె భర్తకే కాదు, కుటుంబానికి కూడా హానికరమని చాణక్యుడు చెప్పారు. అటువంటి వారు బంధాలలో నిజాయితీగా ఉండలేరు.
- అహంకార స్వభావం: ఇతరుల కంటే తామే గొప్ప అని భావించే అహంకారం ఉన్న స్త్రీని వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే ఆమె బంధాలకు గౌరవం ఇవ్వలేదు. దీనివల్ల ఇంట్లో నిత్యం గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వారి నుంచి దూరంగా ఉండటం ఉత్తమం.
