చిన్న తలనొప్పికి రూ. 500 ఆర్డరా..? చిన్న గొడవతో లవర్‌ను బ్లాక్ చేసిన 20 నిమిషాల్లోనే అదిరిపోయే ట్విస్ట్.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్!

ఓల్డ్ ఢిల్లీకి చెందిన ఓ యువతి, రాత్రి 10 గంటల సమయంలో తలనొప్పి విషయంలో ప్రియుడితో వచ్చిన చిన్న మనస్పర్థల కారణంగా కోపంతో అతని నంబర్‌ను 20 నిమిషాల పాటు బ్లాక్ చేసింది.

ఆమెను ఎలాగైనా కూల్ చేయాలనుకున్న ప్రియుడు.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బ్లింకిట్ (Blinkit) యాప్ ద్వారా రూ. 500 ఖర్చు చేసి డెయిరీ మిల్క్ చాక్లెట్, తలనొప్పి బామ్, చిప్స్, వాటర్ బాటిల్‌ను ఆమె గది చిరునామాకు ఆర్డర్ చేసి పంపించాడు.

డెలివరీ సరిగ్గా ఆమెకే చేరాలనే ఉద్దేశంతో అతడు ఆర్డర్‌లో ఆ యువతి ఫోన్ నంబర్‌నే ఇచ్చాడు. ప్రియుడు చూపించిన ఈ చిన్నపాటి శ్రద్ధ, మెరుపు వేగంతో తీసుకున్న నిర్ణయం ఆమె కోపాన్ని చిటికెలో మటుమాయం చేసి, ఆమె మనసును పూర్తిగా గెలుచుకుంది.

రాత్రి 10 గంటలకు వచ్చిన చిన్న తలనొప్పి కోసం ఏమాత్రం ఆలోచించకుండా రూ. 500 ఖర్చు చేసి కేరింగ్ చూపించేవాడే నిజమైన లవర్ అని, ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమకు మరో పేరే నమ్మకమని ఆ యువతి మురిసిపోతూ నెటిజన్లతో పంచుకుంది.


Posted

in

by

Tags: