న్యూయార్క్: ఇంగ్లాండ్, అర్జెంటీనా జట్ల మధ్య నిన్న జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో, ఇంగ్లాండ్ యువ ఆటగాడు జూడ్ బెల్లింగ్‌హామ్ మరియు అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీల మధ్య చోటుచేసుకున్న ఒక తీవ్రమైన ఘర్షణే మొత్తం మ్యాచ్ తలరాతను మార్చేసింది.
అట్లాంటాలోని మెర్సిడెస్ బెంజ్ మైదానంలో జరిగిన 2026 ఫిఫా (FIFA) ప్రపంచకప్ సెమీఫైనల్లో అర్జెంటీనా ఘన విజయం సాధించింది.
ను మలుపు తిప్పిన ఆ గొడవ: మ్యాచ్ మొదటి భాగంలో (ఫస్ట్ హాఫ్) గోల్ కొట్టడానికి ఇరు జట్లు తీవ్రంగా శ్రమించాయి. ఆట చాలా దూకూడుగా, శారీరక ఘర్షణలతో కూడి సాగింది. ఫుట్‌బాల్‌ను తన్నడం కంటే ఆటగాళ్లు ఒకరి కాళ్లనొకరు తన్నుకోవడమే ఎక్కువగా కనిపించింది. గొడవ పీక్స్‌కు చేరిన సమయంలో, అంపైర్ ఇస్మాయిల్‌ను ఆటగాళ్లు చుట్టుముట్టి ప్రశ్నించడం ప్రారంభించారు.
మార్పిడులు, గొడవలు నిరంతరం జరుగుతుండటంతో తీవ్ర అసహనానికి గురైన జూడ్ బెల్లింగ్‌హామ్, లియోనెల్ మెస్సీ వైపు చూస్తూ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మధ్యమధ్యలో బూతు పదాలను కూడా ఉపయోగించాడు. సాధారణంగా మైదానంలో చాలా ప్రశాంతం ఉండే మెస్సీ ఈసారి వెనక్కి తగ్గలేదు. బెల్లింగ్‌హామ్ ముఖానికి నేరుగా వెళ్లి దూకుడుగా సమాధానమిచ్చాడు.
అక్కడ ఉన్న తోటి ఆటగాళ్లు వారిద్దరినీ విడదీసినప్పటికీ, మైదానంలో ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది. బెల్లింగ్‌హామ్ చేసిన ఈ కయ్యం, అర్జెంటీనా కెప్టెన్ మెస్సీతో పాటు మొత్తం అర్జెంటీనా ఆటగాళ్లలో తీవ్రమైన పట్టుదలను, ఆగ్రహాన్ని రగిల్చింది.
చివరికి బెల్లింగ్‌హామ్ ఏదో అనగా, మెస్సీ దానికి ఎలాంటి మాటల సమాధానం ఇవ్వలేదు. “ఓ అలాగా!” అన్నట్లు ముఖం తిప్పుకున్నాడు. ముఖాన్ని పక్కకు తిప్పి.. ‘చూసుకుందాం’ అన్నట్లుగా కేవలం ఒక సైగ మాత్రమే చేశాడు! ఈ ఒక్క పాయింటే ఇంగ్లాండ్ జట్టు అర్జెంటీనాపై చేసిన అతిపెద్ద తప్పిదంగా మారింది.
అర్జెంటీనా విశ్వరూపం: దీని తర్వాత అర్జెంటీనా జట్టు ఆటలో వేగం పెంచింది. అయినప్పటికీ, సెకండ్ హాఫ్ 55వ నిమిషంలో ఇంగ్లాండ్ ఆటగాడు ఆంథోనీ గోర్డాన్ ఒక అద్భుతమైన గోల్ కొట్టి ఇంగ్లాండ్‌ను 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఇంగ్లాండ్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
కాని, మెస్సీ మనసులో రగులుతున్న ఆ కోపం చల్లారలేదు. ఇంగ్లాండ్ జట్టు డిఫెన్స్ (రక్షణాత్మక) ఆటలోకి మారిన తరుణంలో, అర్జెంటీనా సింహంలా గర్జిస్తూ ఇంగ్లాండ్‌పై దాడికి దిగింది. బెల్లింగ్‌హామ్ గొడవ వల్ల వచ్చిన ఆ కోపం, లియోనెల్ మెస్సీని ఒక సాధారణ ఆటగాడి నుండి యుద్ధ వీరుడిగా మార్చేసింది. ప్రతి అర్జెంటీనా ఆటగాడి కాళ్లలోనూ ఆ వేగం స్పష్టంగా కనిపించింది.
మెస్సీ మ్యాజిక్: అసాధ్యమైన కంబ్యాక్! ఆట 85వ నిమిషం వరకు ఇంగ్లాండ్ విజయానికి అత్యంత చేరువగా ఉంది. కానీ అర్జెంటీనా వేగాన్ని ఇంగ్లాండ్ ఎంతమాత్రం అడ్డుకోలేకపోయింది. ఒక కార్నర్ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుని ఎంజో ఫెర్నాండెజ్ అర్జెంటీనా తరపున మొదటి గోల్ కొట్టాడు. దీంతో మైదానమంతా హోరెత్తిపోయింది.
అదనపు సమయం వైపు వెళ్తుందని అందరూ భావిస్తున్న తరుణంలో, 90వ నిమిషంలో మెస్సీకి సంబంధించిన ఆ చారిత్రాత్మక మ్యాజిక్ క్షణం ఆవిష్కృతమైంది. ఖచ్చితంగా గోల్ కొట్టే పొజిషన్లో బంతిని అందుకున్న మెస్సీ, ఇంగ్లాండ్ ఆటగాళ్లను బురిడీ కొట్టిస్తూ పెనాల్టీ బాక్స్‌లోకి క్రాస్ పాస్ ఇచ్చాడు.
తనకు స్వయంగా గోల్ కొట్టే అవకాశం ఉన్నప్పటికీ, తోటి ఆటగాడు లాటారో మార్టినెజ్‌కు బంతిని పాస్ చేశాడు. అతను దాన్ని హెడర్ ద్వారా అద్భుతమైన గోల్‌గా మలిచాడు. దీంతో అర్జెంటీనా 2-1 తేడాతో అసాధ్యమైన కంబ్యాక్ ఇచ్చి, ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
జూడ్ బెల్లింగ్‌హామ్ మెస్సీని గెలికిన ఆ ఒక్క క్షణం, అర్జెంటీనా జట్టులో నిద్రపోతున్న సింహాన్ని మేల్కొల్పింది. ఆ కసితోనే వారు ఫైనల్‌కు చేరుకున్నారు. మెస్సీతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇంగ్లాండ్‌కు అర్జెంటీనా సరైన పాఠం నేర్పింది.
