“చిప్స్ ప్యాకెట్‌లో ఉన్న ‘ఆ’ ఒక వస్తువు. పోయిన 5 ఏళ్ల బాలుడి ప్రాణం. ఆట వికటించి విషాదం.!”

మైసూరు ప్రాంతానికి చెందిన దంపతుల ఐదేళ్ల కుమారుడు ముకుంద్ మయూర్, చిప్స్ ప్యాకెట్‌లో ఉన్న బహుమతి బొమ్మను సరదాగా నోట్లో వేసుకున్నప్పుడు అది గొంతులో చిక్కుకుని, ఊపిరి ఆడక విషాదకరంగా మృతి చెందిన సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

తమ ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయి తలడిల్లుతున్న తల్లిదండ్రుల వేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

ఇలాంటి ఊహించని అవాంఛనీయ సంఘటనలను నివారించడానికి, చిన్న పరిమాణంలో ఉన్న ప్రమాదకరమైన ప్లాస్టిక్ బొమ్మలతో వచ్చే స్నాక్స్ ప్యాకెట్లను చిన్న పిల్లలకు ఇవ్వకూడదని, వారి ఆహార అలవాట్ల విషయాలలో తల్లిదండ్రులు తీవ్ర విజిలెన్స్‌తో ఉండాలని వైద్యులు కఠినంగా హెచ్చరిస్తున్నారు.


Posted

in

by

Tags: