చేతినిండా వేతనంనిచ్చే ఉద్యోగాన్ని వదిలేసి దేశం చుట్టూ తిరగడానికి వెళ్లిన 28 ఏళ్ల యువతి..! కేవలం 14 రోజుల్లోనే “అయ్యో, ఉద్యోగం మానేసి ఉండకూడదేమో!” అంటూ విలవిల. చివరికి ఏం జరిగింది?

కార్పొరేట్ ఉద్యోగంలో కలిగే మానసిక ఒత్తిడి నుండి విముక్తి పొంది, తనకు నచ్చినట్లుగా జీవితాన్ని గడపాలని చాలామంది కోరుకుంటారు.

అలాగే 28 ఏళ్ల ఒక యువతి కూడా తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఒంటరిగా ఐరోపా (యూరప్) దేశాలను చుట్టి రావడానికి బయలుదేరింది. కానీ, ఆమె అనుకున్నట్లుగా ఆ ప్రయాణం ఆనందదాయకంగా సాగలేదు. కేవలం రెండు వారాలకే తాను తీసుకున్న నిర్ణయానికి చింతించడం ప్రారంభించినట్లు ఆమె పంచుకున్న పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

రోజంతా ఆఫీస్ పని, పనికి సంబంధించిన ఒత్తిడి, ఒకే రకమైన యాంత్రిక జీవితంతో విసిగిపోయిన ఆమె, ఉద్యోగం మానేసి ప్రపంచాన్ని చుట్టిరావాలని నిర్ణయించుకుంది. కొత్త ప్రదేశాలను సందర్శించడం, కొత్త వ్యక్తులను కలవడం, తనకు నచ్చినట్లు బతకడం వంటి అనేక అంచనాలతో ఆమె ప్రయాణం ప్రారంభించింది.

ఆస్ట్రియా రాజధాని వియన్నాకు వెళ్లినప్పుడు, అక్కడి ప్రజల ప్రవర్తనా తీరు తాను ఊహించినట్లుగా లేదని ఆ యువతి గ్రహించింది. ఆ తర్వాత ఇటలీలోని రోమ్ నగరానికి వెళ్లినప్పుడు, అక్కడ పరిశుభ్రత మరియు భద్రత విషయంలో తనకు కొన్ని అసౌకర్యాలు కలిగినట్లు తన పోషట్‌లో పేర్కొంది. దీనివల్ల ఆస్ట్రేలియాలో తనకు దక్కిన స్నేహపూర్వక వాతావరణం, మంచి కాఫీ, ఆహ్లాదకరమైన వాతావరణం, భద్రత వంటి విషయాలను ఆమె ఎక్కువగా గుర్తుచేసుకోవడం ప్రారంభించింది.

ఆరు నెలల పాటు ఐరోపాలో ఒంటరిగా ప్రయాణం చేయాలని ప్లాన్ చేసుకున్న ఆమె, రెండో వారానికే ఇల్లు గుర్తుకువచ్చి బాధపడటంతో పాటు, ఉద్యోగం వదిలేయడం తొందరపాటు నిర్ణయం అయి ఉంటుందోనని ఆలోచించింది. ఆమె చేసిన రెడిట్ పోస్ట్ వైరల్ కావడంతో, చాలామంది నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కేవలం రెండు వారాల అనుభవాన్ని మాత్రమే చూసి మొత్తం ప్రయాణాన్ని అంచనా వేయవద్దని, కొత్త దేశం మరియు సంస్కృతికి అలవాటు పడటానికి కొంత సమయం పడుతుందని కొందరు సూచించారు. ఈ అనుభవం, విదేశీ ప్రయాణం ఎప్పుడూ మనం ఊహించినట్లుగా ఉండదని, ఇళ్లొద్ద ఉండే దాని విలువ దూరం వెళ్లినప్పుడే తెలుస్తుందనే సత్యాన్ని కళ్లకు కట్టింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *