“చేతిలో ఒక్క రూపాయి లేదు.. తినడానికి కూడా డబ్బుల్లేవు..!” వాటర్ బాటిళ్లు మోస్తూ జీవితాన్ని ప్రారంభించిన యువతి.. నేడు కోటీశ్వరురాలు ఎలా అయ్యిందంటే..?

ఉద్యోగం, చేతిలో చిల్లిగవ్వ లేకుండా అబుదాబి నుంచి దుబాయ్‌కి మారిన ఆలియా లాలా అనే యువతి, ప్రారంభంలో కనీసం ఆహారం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.

తన స్నేహితురాలి గదిలో తలదాచుకున్న ఆమె, చుట్టుపక్కల వారికి వాటర్ బాటిళ్లు మోసి పెడుతూ, దాని ద్వారా వచ్చే చిన్నపాటి టిప్స్‌తోనే ఒక షవర్మా కొనుక్కుని తింటూ రోజులు గడిపేది.

ఒక నెల తర్వాత ఉద్యోగం సంపాదించిన ఆలియా లాలా, ఆపై తన కఠిన శ్రమతో మీడియా రంగంలోకి అడుగుపెట్టింది. మోడలింగ్, ఫోటోగ్రఫీ వంటి పలు రంగాల్లో అనుభవం సంపాదించిన ఆమె, గత 14 ఏళ్లుగా ప్రముఖ ట్రావెల్ అండ్ లైఫ్‌స్టైల్ కంటెంట్ క్రియేటర్‌గా ఎదిగి పలు అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తోంది.

తన కష్టంతో ప్రస్తుతం పలు మార్గాల ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న ఆమె, ప్రముఖ బ్రాండ్లు, టూరిజం బోర్డులతో కలిసి పనిచేయడమే కాకుండా సొంతంగా ఒక మీడియా హౌస్‌ను కూడా నడుపుతోంది. అంతేకాకుండా దుబాయ్ రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి తన ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంది.

ఏడాదికి లక్షలాది రూపాయల ఆదాయం ఆర్జించే విజయవంతమైన వ్యాపారవేత్తగా మారిన ఆలియా లాలా, వివిధ వ్యాపారాలు ప్రారంభించి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించింది. ప్రారంభంలో కనీస ఖర్చులకే ఇబ్బంది పడిన ఆమె, నేడు తన పట్టుదలతో ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.


Posted

in

by

Tags: