దక్షిణ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో మున్నాలాల్ (55) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణంగా హత్యకు గురయ్యాడు.
దొంగలు ఇంట్లోకి చొరబడి తన భర్తను చంపేశారని ఆయన భార్య నాజియా ప్రారంభంలో పోలీసుల వద్ద నాటకమాడింది.
అయితే, సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు ఆమెను విచారించడంతో అసలు నిజం బయటపడింది. నాజియా తన ప్రియుడి సాయంతో భర్త తాగే నీళ్లలో మత్తుమందు కలిపి ఇచ్చింది. ఆయన స్పృహ తప్పి పడిపోయిన తర్వాత, వారిద్దరూ కలిసి ఆయన మెడకు తాడు బిగించి, కరెంట్ షాక్ ఇచ్చి, కర్రలతో దాడి చేసి దారుణంగా చంపేశారు.
తన భర్తను చంపేందుకు ప్రియుడు సమన్తో నాజియా రూ. 5 లక్షల డీల్ మాట్లాడుకున్నట్లు విచారణలో తెలిసింది. హత్య పూర్తి చేసిన వెంటనే అతనికి నాజియా రూ. 20,000 అడ్వాన్స్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, ఈ హత్యలో సమన్కు సహకరించిన కిషన్ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు గుర్తించారు.

Leave a Reply