ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జాలౌన్ జిల్లాకు చెందిన ఒక మహిళ, రోజూ ఉద్యోగానికి వెళ్లి వస్తుండేది.
ఆమె రాకపోకలు సాగించే దారిలో ఒక ఆకతాయి గత కొద్ది రోజులుగా ఆమెను వెంబడిస్తూ, అసభ్యకర చేష్టలతో తీవ్రంగా వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు.
ఒకరోజు సాయంత్రం పని ముగించుకుని ఆ మహిళ ఇంటికి తిరిగి వెళ్తుండగా.. ఆ పోకిరీ మళ్లీ ఆమెను వెంబడించి అసభ్యంగా మాట్లాడుతూ లైంగిక వేధింపులకు పాల్పడే ప్రయత్నం చేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ మహిళ, ఎంతో ధైర్యంతో ఆ దుండగుడి చొక్కా కాలర్ పట్టుకుని చెంప చెల్లుమనిపించి కేకలు వేసింది.
ఆమె అరుపులు విన్న స్థానికులు క్షణాల్లో అక్కడికి చేరుకుని ఆ ఆకతాయి బట్టలు ఊడదీసి దేహశుద్ధి చేశారు. ఆగ్రహం కట్టలు తెంచుకున్న ఆ మహిళ కూడా తన కాలి చెప్పుతో అతడిని చితక్కొట్టడంతో, అతడి పైశాచిక కామోన్మాదం ఆ దెబ్బలతో అక్కడికక్కడే దిగిపోయింది.

Leave a Reply