కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ‘వందేమాతరం’ గేయానికి సంబంధించి కొత్త ప్రోటోకాల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం, జాతీయ గేయం ‘వందేమాతరం’లోని ఆరు చరణాలతో కూడిన 3 నిమిషాల 10 సెకన్ల పూర్తి వెర్షన్‌ను ఇకపై అధికారిక కార్యక్రమాల్లో పాడటం లేదా ప్లే చేయడం తప్పనిసరి.
ముఖ్యమైన మార్గదర్శకాలు:
- ముందు వందేమాతరం: ఏదైనా అధికారిక కార్యక్రమంలో జాతీయ గేయం (వందేమాతరం) మరియు జాతీయ గీతం (జనగణమన) రెండూ ఉన్నట్లయితే, మొదట వందేమాతరం వినిపించాలి, ఆ తర్వాతే జనగణమన ఉండాలి.
- గౌరవ సూచికంగా నిలబడటం: అధికారికంగా ఈ గేయాన్ని ప్లే చేస్తున్నప్పుడు లేదా పాడుతున్నప్పుడు ప్రజలందరూ గౌరవంగా ‘సావధాన్’ (Attention) భంగిమలో నిలబడటం తప్పనిసరి.
- ఎక్కడ అమలు అవుతుంది?: రాష్ట్రపతి, గవర్నర్ల రాక మరియు నిష్క్రమణ సమయంలో, జాతీయ జెండా ఆవిష్కరణ వేళ, రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి ప్రసంగించే ముందు మరియు తర్వాత ఈ గేయాన్ని వినిపించాలి.
- పాఠశాలల్లో: పాఠశాలల్లో రోజువారీ కార్యకలాపాలను వందేమాతరం సామూహిక గాయనంతో ప్రారంభించాలని ప్రభుత్వం సూచించింది.
- మినహాయింపు: ఏదైనా డాక్యుమెంటరీ లేదా న్యూస్ ఫిలింలో ఈ గేయం భాగంగా ఉంటే, అక్కడ ప్రేక్షకులు నిలబడాల్సిన అవసరం లేదు.
