జాగ్రత్త! మీరు థర్డ్ ఏసీలో ప్రయాణిస్తున్నారా? అయితే ఈ వార్త చూడండి; మీకూ ఇలాంటి పరిస్థితి ఎదురుకావచ్చు

ఒక ప్రయాణికుడు సోషల్ మీడియాలో తన ఆవేదనను పంచుకుంటూ.. థర్డ్ ఏసీలో కన్ఫర్మ్ టికెట్ ఉన్నప్పటికీ, తన పిల్లలను ఒడిలో కూర్చోబెట్టుకుని ఐదు గంటల పాటు నరకం అనుభవించాల్సి వచ్చిందని తెలిపాడు. ‘రెడిట్’ (Reddit) వేదికగా ఆయన భారతీయ రైల్వేలోని ‘కో-ఆపరేట్ కల్చర్’ (సర్దుకుపోవాలనే ధోరణి)పై తీవ్ర విమర్శలు చేశారు.

అసలేం జరిగింది? సదరు ప్రయాణికుడు తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి ‘పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్’లో సూరత్ నుండి దాహోద్ వరకు (సుమారు 300 కి.మీ) ప్రయాణం బుక్ చేసుకున్నాడు. ప్రయాణం తక్కువే కాబట్టి పిల్లల కోసం విడిగా బర్త్‌లు తీసుకోలేదు. ఏసీ కోచ్ కాబట్టి ప్రశాంతంగా ఉంటుందని భావించాడు, కానీ కోచ్ ఎక్కగానే అతడి ఆశలు అడియాశలయ్యాయి.

కోచ్‌లో పరిస్థితి: ఆ కోచ్‌లో అప్పటికే ఎనిమిది మంది సభ్యుల ఒక పెద్ద బృందం ఉంది. వారి వద్ద కేవలం రెండు కన్ఫర్మ్ టికెట్లు మాత్రమే ఉన్నాయి, కానీ వారు ఒక పెళ్లికి వెళ్లి వస్తుండటంతో వారి వద్ద 25 కంటే ఎక్కువ బ్యాగులు ఉన్నాయి. సీట్ల కింద, దారిలో.. ఎక్కడ చూసినా సామాన్లే ఉన్నాయి. ఇతర ప్రయాణికులను ‘ప్లీజ్ కో-ఆపరేట్’ అని అడుగుతూ అందరినీ ఇబ్బంది పెట్టారు. టికెట్ చెకర్ (TTE) ఇది అంతా చూస్తున్నా ఏమీ చేయలేదని సదరు ప్రయాణికుడు ఆరోపించాడు. ఏసీ టికెట్ తీసుకున్నా సాధారణ డబ్బాలో ప్రయాణించినట్లే ఉందని ఆయన వాపోయారు.


Posted

in

by

Tags: