టీ చిక్కగా, సువాసనగా రావాలా? చెఫ్ భరత్ చెప్పిన 5 చిట్కాలు!

చాలా మంది టీలో అల్లం, యాలకులు, పాలు, పంచదార అన్నీ వేసినా హోటల్ స్టైల్ రుచి రాదు. దానికి కారణం పదార్థాలు వేసే విధానం మరియు సమయం. చెఫ్ భరత్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పంచుకున్న ఆ రహస్యాలు ఇవే:

  1. అల్లాన్ని తురమవద్దు: అల్లాన్ని ఎప్పుడూ తురిమి (Grated) వేయకూడదు. అలా చేస్తే టీ చేదుగా మారుతుంది. అల్లాన్ని ఎల్లప్పుడూ కచ్చాపచ్చాగా దంచి (Crushed) వేయాలి. దీనివల్ల టీకి మంచి సువాసన, రుచి వస్తాయి.
  2. నీళ్లు మరిగాకే అల్లం వేయాలి: చల్లటి నీళ్లలోనే అల్లం వేయకూడదు. నీళ్లు మరగడం మొదలయ్యాక అల్లం వేస్తే ‘డిఫ్యూజన్’ (Diffusion) ప్రక్రియ ద్వారా అల్లం ఫ్లేవర్ నీటిలోకి బాగా వెళ్తుంది. దాల్చిన చెక్క, లవంగాలు కూడా ఈ దశలోనే వేయాలి.
  3. టీ పొడి ఎప్పుడు వేయాలి?: నీళ్లు బాగా మరుగుతున్నప్పుడే టీ పొడి వేయాలి. అప్పుడు టీ పొడిలోని రంగు, వాసన పూర్తిగా బయటకు వచ్చి టీ అద్భుతంగా ఉంటుంది.
  4. టీ పొడితో పాటే పంచదార: పాలు పోసిన తర్వాత పంచదార వేయడం సరైన పద్ధతి కాదు. టీ పొడి మరిగేటప్పుడే పంచదార వేయాలి. దీనివల్ల టీ చిక్కగా (Thick) మారుతుంది. పాలు పోశాక పంచదార వేస్తే పాలు పలచబడి టీ రుచి తగ్గుతుంది.
  5. వేడి పాలు మాత్రమే పోయాలి: టీ డికాషన్ మరిగాక అందులో చల్లటి పాలు పోయకూడదు. దీనివల్ల ‘టెంపరేచర్ షాక్’ తగిలి టీ రుచి మారిపోతుంది. అందుకే పాలను ముందే వేడి చేసి పెట్టుకుని, డికాషన్‌లో కలిపితే రుచి అద్భుతంగా ఉంటుంది.

Posted

in

by

Tags: