టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టు సరికొత్త రికార్డు!

టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టు ఒక అద్భుతమైన రికార్డును నెలకొల్పింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోడర్నీలో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్ మరియు నమీబియా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత నమోదైంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నమీబియా జట్టు బౌలింగ్ ఎంచుకోగా, భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేపట్టింది.

అతివేగంగా 100 పరుగులు చేసి రికార్డు! భారత ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు సంజు శామ్సన్ మరియు ఇషాన్ కిషన్ ధాటిగా ప్రారంభించారు. సంజు శామ్సన్ 8 బంతుల్లోనే 22 పరుగులు (1 ఫోర్, 3 సిక్సర్లు) చేసి అవుట్ అయినప్పటికీ, ఆ తర్వాత ఇషాన్ కిషన్‌కు తిలక్ వర్మ జతకలిశారు. ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పవర్ ప్లే చివరి ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ బాది కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

ఈ క్రమంలో భారత జట్టు కేవలం 6.5 ఓవర్లలోనే 100 పరుగుల మైలురాయిని దాటింది. తద్వారా టీ20 ప్రపంచకప్ చరిత్రలో అతివేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా భారత్ సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది.

దీనికి ముందు, 2014 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌పై నెదర్లాండ్స్ జట్టు 7 ఓవర్లలో 100 పరుగులు చేయడమే ఇప్పటివరకు అత్యుత్తమ రికార్డుగా ఉండేది. ఇప్పుడు భారత్ ఆ రికార్డును అధిగమించింది.


Posted

in

by

Tags: