ట్రంప్ నెత్తిపై ఇరాన్ పిడుగు..! అమెరికా ‘విక్టోరియా బేస్’ ఖాళీ.. అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద తీవ్ర ఉద్రిక్తత!!!

బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం (Embassy) మరియు విక్టోరియా బేస్ (Victoria Base) సైనిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన డ్రోన్ దాడులతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లు విరుచుకుపడ్డాయి. ఈ దాడి కారణంగా ఎంబసీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడిన నల్లటి పొగ కిలోమీటర్ల దూరం వరకు కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఈ దాడికి ఇరాన్ మద్దతు ఉన్న సాయుధ ముఠా ‘అషాబ్ అల్-కహఫ్’ (Ashab al-Kahf) అధికారికంగా బాధ్యత వహించింది. ఇరాన్-ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య ప్రత్యక్ష యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో, ఇరాక్‌లోని అమెరికా ఆస్తులు మరియు సైనిక స్థావరాలను ఈ బృందాలు నిరంతరం లక్ష్యంగా చేసుకుంటున్నాయి.

అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి సమీపంలోనే ఈ పేలుళ్లు మరియు అగ్నిప్రమాదం జరగడంతో బాగ్దాద్ విమానాశ్రయ కార్యకలాపాలు మరియు విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భద్రతా కారణాల దృష్ట్యా పలు విమానాలను రద్దు చేశారు. ఇరాక్‌లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతుండటంతో, అక్కడ ఉన్న అమెరికా పౌరులందరూ వెంటనే ఆ దేశాన్ని విడిచి వెళ్లాలని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది.


Posted

in

by

Tags: