ట్రంప్ సంచలనం! ఏ అధ్యక్షుడికీ సాధ్యం కాని విజయం.. ప్రపంచ దేశాల్లో గుబులు

చివరికి ట్రంప్ అనుకున్నది సాధించారు! ఏ అధ్యక్షుడికీ సాధ్యం కాని అరుదైన ఘనతను ఒకే ఒక్క ఎత్తుగడతో సొంతం చేసుకున్నారు, కానీ ప్రపంచం మాత్రం ఆందోళనలో ఉంది.

న్యూ ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది జనవరిలో బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నారు. మిత్ర దేశాలు, ప్రత్యర్థి దేశాలు అని తేడా లేకుండా అన్ని దేశాల దిగుమతులపై భారీగా ‘టారిఫ్’లు (సుంకాలు) విధిస్తూ అమెరికా ప్రయోజనాలే ముఖ్యమని చాటిచెప్పారు.

ఇప్పుడు ఆయన వ్యూహం ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా చరిత్రలో మొదటిసారిగా తన వాణిజ్య లోటు (Trade Deficit) నుండి బయటపడుతోంది. టారిఫ్ల కారణంగా అమెరికా వాణిజ్య లోటు ఇప్పటికే 78 శాతం వరకు తగ్గిందని, 2026 నాటికి అమెరికా ‘ట్రేడ్ సర్ ప్లస్’ (వాణిజ్య మిగులు) స్థితికి చేరుకుంటుందని ట్రంప్ ప్రకటించారు. ఇదే జరిగితే, అమెరికాను వాణిజ్య లోటు నుండి గట్టెక్కించిన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ నిలుస్తారు.

ట్రంప్ సోషల్ మీడియా ప్రకటన: ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికపై స్పందిస్తూ.. “అమెరికా వాణిజ్య లోటు వేగంగా తగ్గుతోంది. 2026లో మొదటిసారిగా మనం వాణిజ్య మిగులును సాధించబోతున్నాం. ప్రపంచ దేశాలపై మనం విధించిన సుంకాల వల్లే ఇది సాధ్యమైంది” అని పేర్కొన్నారు. భారత్ సహా సుమారు 50 దేశాలపై ట్రంప్ టారిఫ్లు విధించడం ద్వారా అమెరికాకు బిలియన్ల కొద్దీ డాలర్ల ఆదాయం సమకూరింది.


Posted

in

by

Tags: