“డబ్బు ఇవ్వకపోతే కొడతావా? ఇక నువ్వు బ్రతకకూడదు!” – మద్యం కోసం వేధించిన భర్త; పాయసంలో విషం కలిపి చంపేసిన భార్య..!!

ఉత్తరప్రదేశ్‌లో గుండెలు పిండేసే ఒక దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. ఆగ్రాకు చెందిన సురేంద్ర శర్మ (44) అనే వ్యక్తి ఉద్యోగం లేక, తీవ్రమైన మద్యం వ్యసనానికి బానిసయ్యాడు.

ప్రతిరోజూ తన భార్య రూబీ శర్మ (40)ను డబ్బుల కోసం వేధించడమే కాకుండా, డబ్బు ఇవ్వకపోతే ఆమెను దారుణంగా కొట్టేవాడు. ఈ వేధింపులు భరించలేని రూబీ, తన భర్తను అంతమొందించాలని నిర్ణయించుకుంది.

ప్రణాళిక ప్రకారం, మే 18న తన భర్తకు ఇష్టమైన పాయసంలో భారీగా నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అతను స్పృహ తప్పిన తర్వాత, అత్యంత క్రూరంగా చంపేసింది.

మరుసటి రోజు ఉదయం ఎవరికీ అనుమానం రాకుండా తన ఇద్దరు కుమార్తెలను బంధువుల ఇంటికి పంపించేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో, బాత్‌రూమ్ నేలను తవ్వి భర్త మృతదేహాన్ని పాతిపెట్టి, దానిపై సిమెంట్ పూసింది. ఎవరికీ అనుమానం రాకూడదని దానిపై కొత్త టైల్స్ వేయించి, పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త కనిపించడం లేదని డ్రామా ఆడింది.

అంతలో సురేంద్ర శర్మ తమ్ముడు, తన అన్న కనిపించకుండా పోయిన తర్వాత కూడా అతని ఏటీఎం కార్డు నుండి డబ్బులు డ్రా అవుతున్నాయని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనితో పోలీసులు సురేంద్ర ఇంటిని సోదా చేయగా, బాత్‌రూమ్‌లో కొత్తగా వేసిన టైల్స్ చూసి అనుమానం వచ్చి, వాటిని పగలగొట్టి చూడగా సురేంద్ర శర్మ అస్థిపంజరం బయటపడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.


Posted

in

by

Tags: