సూపర్ బజార్లో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన ఘటనపై ఓ కస్టమర్ చేసిన ఆరోపణల ఆధారంగా ఈ కథనం వెలుగులోకి వచ్చింది.
ఇటీవల షాపింగ్ కోసం సూపర్ మార్కెట్‌కు వెళ్లిన సమయంలో, అక్కడ కొందరు లాండ్రీ (డ్రై క్లీనింగ్) నిర్వాహకులు ఎక్స్పైరీ అయిపోయిన డిటర్జెంట్ సర్ఫ్ పౌడర్లను భారీ మొత్తంలో కొనుగోలు చేస్తుండటాన్ని సదరు కస్టమర్ గమనించినట్లు పేర్కొన్నారు. అంత పెద్ద మొత్తంలో ఎక్స్పైర్డ్ డిటర్జెంట్లను తీసుకెళ్లి ఏం చేస్తారని వారిని ప్రశ్నించగా.. తాము బట్టలు ఉతికే లాండ్రీ వ్యాపారంలో ఉన్నామని సమాధానమిచ్చారట.
ఎక్స్పైరీ అయిపోయిన సర్ఫ్ పౌడర్లు, కెమికల్స్‌ను ఉపయోగించి బట్టలు ఉతికితే, అవి ప్రజల దుస్తులను తీవ్రంగా పాడుచేసే ప్రమాదం ఉంది. కస్టమర్ల నుంచి సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నప్పుడు నాణ్యమైన ఉత్పత్తులనే వాడాలి తప్ప, ఇలాంటి పనికిరాని వస్తువులను ఉపయోగించడం ఎంతమాత్రం సరికాదని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ తతంగాన్ని కళ్లారా చూసిన తర్వాత, ఇకపై ఎప్పటికీ లాండ్రీ షాపులకు బట్టలు ఇవ్వకూడదని ఆ కస్టమర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, రిలయన్స్ స్మార్ట్ బజార్ యాజమాన్యం గడువు ముగిసిన వస్తువులను పారవేయకుండా, వాటిని ఏదోలా విక్రయించి డబ్బు చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తోందంటూ సదరు వ్యక్తి తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

Leave a Reply