“డిసెంబర్ 26న పెళ్లి.. అంతలోనే ఇంత పనా?” వీడియో కాల్‌లో మాట్లాడుకుని జంట తీసుకున్న షాకింగ్ నిర్ణయం!

కేరళ రాష్ట్రంలోని కాసర్‌గోడ్‌కు చెందిన అనుశ్రీ (24) అనే యువతి కర్ణాటకలోని ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తోంది.

ఈమెకు, కణ్ణూర్‌కు చెందిన అమల్ అనే యువకుడికి మధ్య ప్రేమ చిగురించి, ఇరు కుటుంబాల సమ్మతితో వచ్చే డిసెంబర్ 26న వివాహం జరిపించాలని నిర్ణయించారు.

ఈ పరిస్థితుల్లో, కర్ణాటకలోని తన నివాసంలో అనుశ్రీ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతదేహమై కనిపంచింది. ఈ వార్త విని షాక్‌కు గురైన ఆమె కుటుంబ సభ్యులు, పోలీసులు విచారణ జరుపుతుండగానే.. కేరళలో ఉన్న ఆమె కాబోయే భర్త అమల్ కూడా తన ఇంట్లో మృతి చెంది కనిపించాడు.

సంఘటన జరిగిన రోజు వీరిద్దరూ చాలా సేపు వీడియో కాల్‌లో మాట్లాడుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వీడియో కాల్ ముగిసిన కొద్ది నిమిషాల్లోనే రెండు వేర్వేరు రాష్ట్రాల్లో ఈ ఆత్మహత్య సంఘటనలు వరుసగా జరగడంతో, వీరిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పెళ్లికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్న సమయంలో, మంచి జీతంతో ఉద్యోగాలు చేస్తున్న ఈ ప్రేమజంట హఠాత్తుగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అనే దానిపై కర్ణాటక, కేరళ రాష్ట్రాల పోలీసులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన రెండు కుటుంబాలను, బంధువులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.


Posted

in

by

Tags: