తిరుప్పూర్ జిల్లా ఉడుమలైపేటకు చెందిన జగదీష్, 2023లో పీహెచ్డీ (డాక్టరేట్) చదువు కోసం తైవాన్ వెళ్లినప్పుడు, డేటింగ్ యాప్ ద్వారా జోయింగ్-యింగ్ అనే తైవాన్ దేశపు యువతితో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది.
చదువు పూర్తయిన తర్వాత వివాహం చేసుకుంటానని జగదీష్ నమ్మబలకడంతో, ఆ యువతి అతని చదువు, జీవన ఖర్చులను పూర్తిగా తానే భరిస్తూ అతనితో కలిసి సహజీవనం చేసింది. ఈ క్రమంలో గత ఫిబ్రవరిలో స్వదేశానికి తిరిగి వచ్చిన జగదీష్.. తల్లిదండ్రులను ఒప్పించి మళ్లీ తైవాన్ వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్లాడు. కానీ, గత ఐదు నెలలుగా ఆమెతో అన్ని సంబంధాలను పూర్తిగా తెంచుకుని ఆమెను దారుణంగా మోసం చేశాడు.
జగదీష్‌ను సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో తీవ్ర ఆవేదనకు గురైన జోయింగ్-యింగ్, ఉడుమలైపేటకు చెందిన ఒక న్యాయవాది సహాయంతో స్థానిక మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో పాటు విదేశీ యువతి నుంచి భారీగా డబ్బు గుంజిన నేరానికి జగదీష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.

Leave a Reply